సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో మంత్రులు మహ్ముద్ అలీ, తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్, కే కేశవరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏకే ఖాన్, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరైన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
చదవండి: రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం!
ఇఫ్తార్ విందు సందర్భంగా చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్రానికి రోగం వచ్చిందని, చికిత్స చేయాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. కూల్చివేతలు సులువు కానీ దేశాన్ని నిర్మించడం కష్టమన్నారు. ఇక్కడ అల్లరి చేసేవాళ్ల ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేవని, ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం దేశమంతా చీకటి అలుముకుంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment