LB Stadiun
-
నేడే పట్టాభిషేకం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డితో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయిస్తారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రకటన చేయనున్నారు. ఈ వేదికపైనే ఆయా గ్యారంటీలకు సంబంధించిన ఫైల్‌పై రేవంత్ సీఎంగా తొలి సంతకం చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. పకడ్బందీగా ఏర్పాట్లు: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఎల్బీ స్టేడియంను ముస్తాబు చేశారు. భారీ వేదికను సిద్ధం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్, ప్రియాంకలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, టీపీసీసీ సీనియర్ నేతలు వేదికపై ఆసీనులు కానున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం డీజీపీ రవిగుప్తాతో కలసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా అన్నీ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలో తాగునీరు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను సిద్ధం చేయాలని.. వాహనాల పార్కింగ్, బందోబస్తు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్ నేతలు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వివరాలు వెల్లడించారు. కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలు ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. -
హైదరాబాద్‌లో ‘మట్టి కుస్తీ’ సవాల్.. ‘హింద్ కేసరి’ విశేషాలు
సాక్షి, హైదరాబాద్: పుష్కర కాలం తర్వాత భాగ్య నగరంలో మరోసారి సాంప్రదాయ కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం పెద్ద స్థాయి ఈవెంట్లలో అధికారిక క్రీడగా ఉన్న ‘మ్యాట్ రెజ్లింగ్’ కాకుండా మట్టిలో జరిగే హోరాహోరీ సమరాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అందుకే గత 65 ఏళ్లుగా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లను భాగస్వాములుగా చేస్తూ ఈ టోర్నీలను ‘ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ అసోసియేషన్’ విజయవంతంగా నిర్వహిస్తోంది. ‘హింద్ కేసరి’గా గుర్తింపు తెచ్చుకునేందుకు రెజ్లర్లు తలపడే ఈ ఆసక్తికర మట్టి కుస్తీ టోర్నీకి ఎల్బీ స్టేడియం వేదికవుతోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రముఖ రెజ్లర్లందరూ తలపడతారు. గురువారం సాయంత్రం రెజ్లర్ల వెయింగ్ తీసుకుంటారు. సుదీర్ఘ కాలం పాటు తెలంగాణలో రెజ్లింగ్ సంఘానికి చిరునామాగా నిలిచిన విజయ్‌కుమార్ యాదవ్ స్మారకంగా ఈ టోర్నమెంట్‌ను వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో ‘హింద్ కేసరి’ పోటీలు జరగడం ఇది మూడోసారి. 1958లో తొలిసారి జరగ్గా... 2011లో రెండోసారి హైదరాబాద్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2011లో మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిత్ పటేల్ ఫైనల్లో మౌజమ్ ఖత్రీని ఓడించి ‘హింద్ కేసరి’ టైటిల్ సాధించాడు. ‘హింద్ కేసరి’ ఇతర విశేషాలు... ►జనవరి 6 నుంచి 8 వరకు ఎల్బీ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న రెండు మట్టి కోర్టులలో బౌట్లు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి దాదాపు 550 మంది రెజ్లర్లు పాల్గొంటారు. ►పురుషుల విభాగంలో 55 కేజీల నుంచి 90 కేజీల మధ్య 8 కేటగిరీలలో బౌట్లు ఉంటాయి. ‘హింద్ కేసరి’ టైటిల్ కోసం 85 కేజీల నుంచి 140 కేజీల మధ్య ఉన్న∙రెజ్లర్లు పోటీపడతారు. ►మహిళల విభాగంలో 48 కేజీల నుంచి 68 కేజీల మధ్య 5 కేటగిరీల్లో బౌట్లు ఉంటాయి. ‘మహిళా హింద్ కేసరి’ టైటిల్ కోసం 65 నుంచి 90 కేజీల మధ్య రెజ్లర్లు బరిలోకి దిగుతారు. పురుషుల విభాగంలో ‘హింద్ కేసరి’ టైటిల్ విజేతకు రూ. 3 లక్షలతోపాటు 3 కిలోల వెండి గద బహుమతిగా లభిస్తుంది. రన్నరప్‌కు రూ. 2 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన రెజ్లర్‌కు రూ. 1 లక్ష అంద జేస్తారు. మహిళల ‘హింద్ కేసరి’కి రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేస్తారు. ఇతర వెయిట్ కేటగిరీ విజేతలకు కూడా నగదు పురస్కారాలు ఇస్తారు. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం Rishabh Pant: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి పంత్.. అంబానీ ఆస్పత్రిలో చికిత్స.. ఖర్చు మొత్తం ఎవరిదంటే! -
గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ.. నాటి అమరవీరులను త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. 'ఎంతో మంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది. గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సి ఉంది. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి మారుస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. దేశం అనుకున్నంత పురోగతి సాధించలేదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సరైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని' సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
వాహనదారులకు అలర్ట్ ఈ రూట్స్‌లో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, నేడు(సోమవారం) తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగునున్నాయి. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్టు పోలీసులు సూచించారు. ట్రాఫిక్ మళ్లింపు వివరాలు ఇవే.. - చాపెల్‌రోడ్, నాంపల్లి వైపు వచ్చే వాహనాలు పీసీఆర్ వైపు మళ్లింపు.. - బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు గన్‌ఫౌండ్రీ వైపు మళ్లింపు.. - రవీంద్ర భారతి నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు.. - నారాయణ గూడ నుంచి వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్ వైపు మళ్లింపు. ఇది కూడా చదవండి: మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్ -
22న స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 22న ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహించాలని వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ నిర్ణయించింది. గురువారం ఉదయం బీఆర్కేఆర్ భవన్లో ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కేశవరావు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కానున్నట్లు వివరించారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలు ఈ ఉత్సవాలకు హాజరు కానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికా రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ బృందం దేశభక్తి గీతాల సంగీత విభావరి, లేజర్ షో, క్రాకర్స్ ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలు కూడా పాల్గొంటారని కేశవరావు తెలిపారు. 16న సామూహిక జాతీయ గీతాలాపన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు తెలిపారు. నిర్దేశించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారులలో ట్రాఫిక్‌ను నిలిపివేసి జాతీయగీతం ఆలపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు. -
అంతర్జాతీయ యోగా ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
-
కేంద్రానికి రోగం వచ్చింది, చికిత్స చేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో మంత్రులు మహ్ముద్ అలీ, తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్, కే కేశవరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏకే ఖాన్, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరైన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చదవండి: రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం! ఇఫ్తార్ విందు సందర్భంగా చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్రానికి రోగం వచ్చిందని, చికిత్స చేయాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. కూల్చివేతలు సులువు కానీ దేశాన్ని నిర్మించడం కష్టమన్నారు. ఇక్కడ అల్లరి చేసేవాళ్ల ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేవని, ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం దేశమంతా చీకటి అలుముకుంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు. -
కూలిస్తే ఉన్మాదం.. ప్రేమిస్తే మతం
సాక్షి, హైదరాబాద్: ఏ మతమైనా ఎదుటివారిని ప్రేమించాలనే చెబుతుందని, దాడులు చేయాలని ఎక్కడా చెప్పలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మతోన్మాదం పెరిగితేనే విషమ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. మైనారిటీలపై దాడులు తాత్కాలికమేనని, ఈ దాడులతో ఎవరూ సాధించేమీ ఉండదన్నారు. ప్రజలు ఈర్షాద్వేషాలు విడనాడి ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ ఉత్సవాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దాడులతో మానవజాతికి జరిగిన మేలు ఏమీ లేదు.. ఒక మతం మీద మరో మతం ధ్వేషం పెంచుకొని ఆలయాలను, ప్రార్థనా మందిరాలను కూల్చడం వల్ల సాధించిందేమిటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘గతంలో ముస్లింలు గుడులపై దాడులు చేస్తే హిందువులు మసీదులపై దాడులు చేశారు. దీనివల్ల మానవజాతికి జరిగిన మేలు ఏమీ లేదు. ఎదుటివారిని ప్రేమించాలి. మానవజాతికి అదే కావాలి. దేశ జీడీపీ, రాష్ట్ర జీడీపీ అంటే ఏదో ఒక మతానికో సంబంధించిన కాదు. దేశం, రాష్ట్రంలోని ప్రజలందరిదీ’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మనిషిని మనిషిగా చూడలేని వాడు మనిషే కాడు ‘ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలి. ఎదుటివారిని ప్రేమించడమే అత్యుత్తమ మతం. మనిషిని ప్రేమించడమే గొప్ప లక్ష్యం. మనిషిని ప్రేమించలేని వాడు... మనిషిని మనిషిగా చూడలేని వాడు అసలు మనిషే కాదు. మతంలో తప్పులేదు. తప్పు చేయాలని మతం ఎక్కడా చెప్పలేదు. మనిషిని ప్రేమించాలని మాత్రమే మతం చెప్పింది. తప్పు చేయాలని మత బోధకులు చెప్పలేదు. ఈర‡్ష్య, ద్వేషం పెంచుకోవాలని చెప్పలేదు. ప్రేమించాలని, శాంతియుతంగా ఉండాలని చెప్పారు’అని సీఎం అన్నారు. అందరిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే ‘రాష్ట్రంలో ప్రజలంతా ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో పండుగలను సెలబ్రేట్ చేయాలని ఎవరూ చెప్పలేదు. దరఖాస్తులు పెట్టలేదు. ఎన్నో పోరాటాలు, అనేక క్షోభలు ఎదుర్కొన్న తెలంగాణలో అందరూ బాగుండాలని ఓ పాలసీగా తీసుకున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుంటుంది. తెలంగాణలో ఎవరిపైనా ఎవరూ దాడి చేయరు. అందరినీ కాపాడే బాధ్యత తెలంగాణ సర్కార్‌దే. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎట్టుండే... ఇప్పుడు ఎట్లుంది? ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను నిర్మించుకొని ఏటా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దాన్ని కొనాలని కేంద్రంతో కొట్లాడే స్థాయికి తెలంగాణ ఎదిగింది’అని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగులు కలబోసుకున్న దేశం ఇండియానే ‘ప్రపంచంలోని ఇస్లాం దేశాల్లో రెండే పండుగలుంటాయి. క్రిస్టియన్ దేశాల్లోనూ అంతే. కానీ నెల తిరక్కుండానే పండుగలు చేసుకొనే దేశం ఇండియా ఒక్కటే. క్రిస్మస్, రంజాన్, దసరా, దీపావళి, సంక్రాతి... ఇలా అన్ని పండుగలను జరుపుకుంటాం. ప్రపంచంలో అత్యంత రంగుల దేశం ఇండియా ఒక్కటే. భారత్ అత్యుత్తమ దేశం. ఈ దేశంలో ప్రేమైక సమాజం కావాలి’అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి చేస్తున్న కృషి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారు ఎ.కె. ఖాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, క్రైస్తవ ప్రతినిధులు జాన్ గొల్లపల్లి, పూల ఆంథోని, సతీశ్ కుమార్, సాల్మన్, డేనియల్, రాబెల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి -
చాంపియన్స్ విశ్రుత్, స్నేహా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో కె. విశ్రుత్, బి. స్నేహా చాంపియన్లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అండర్–17 బాలబాలికల విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. బాలుర విభాగంలో 2 పాయింట్లతో విశ్రుత్, భవేశ్, అనికేత్ వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో స్నేహా 3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అండర్–15 బాలుర విభాగంలో 3.5 పాయింట్లు సాధించిన అజితేశ్ చాంపియన్‌గా నిలవగా... 3 పాయింట్లతో దైవిక్, వన్‡్ష వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో హరిణి నరహరి (3 పాయింట్లు), సాయి శ్రీయ నాయుడు (2 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) గౌరవ ఉపాధ్యక్షులు కేఏ శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు రాజగోపాల్, కార్యదర్శి కేఎస్ ప్రసాద్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–7 బాలురు: 1. హరిరామ్, 2. ప్రతీక్ రెడ్డి, 3. శ్రీవశిష్ట; బాలికలు: 1. ఐశ్వర్య, 2. శాన్వి, 3. సహస్ర రెడ్డి. అండర్–9 బాలురు: 1. అన్‡్ష నందన్, 2. ఆరుశ్, 3. సాత్విక్; బాలికలు: 1. కీర్తిక, 2. ఆద్య, 3. లహరి. అండర్–11 బాలురు: 1. ఆరుశ్, 2. విశ్వజిత్, 3. అనిరుధ్; బాలికలు: 1. అస్మా, 2. ఫాతిమా, 3. పరిద్యా. అండర్–13 బాలురు: 1. త్రివేద్ రెడ్డి, 2. తుషార్, 3. హిమాకర్; బాలికలు: 1. గీతిక హాసిని, 2. శ్రీయ శర్మ, 3. నేహా. -
నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఐదు వసంతాలు పూర్తిచేసుకుని ఆరో వసంతంలో అడుగిడింది. ఎన్నో పోరాటాలు, ఎందరో బలిదానాల ప్రతిఫలంగా 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. ఆదివారం ఐదో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో జూన్ 3న 1001 మంది కళాకారులతో పేరిణి మహా నృత్య ప్రదర్శన, 4న 5 వేల మంది కళాకారులతో ఒగ్గు డోలు మహా విన్యాసాన్ని ప్రదర్శించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు.. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సైతం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించే బాధ్యతను రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్ (ఖమ్మం), ఈటల రాజేందర్ (కరీంనగర్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్), మల్లారెడ్డి (మేడ్చల్), ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్), వి.ప్రశాంత్‌రెడ్డి (నిజామాబాద్), జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), నిరంజన్‌రెడ్డి (వనపర్తి), దయాకర్‌రావు (వరంగల్ అర్బన్), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్ లక్ష్మణ్ (జయశంకర్ భూపాలపల్లి), ఏకే గోయల్ (కొమురంభీం ఆసిఫాబాద్), ఏకే ఖాన్ (మహబూబాబాద్), రాజీవ్ శర్మ (మంచిర్యాల), అనురాగ్ శర్మ (నాగర్ కర్నూల్), డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నల్లగొండ), ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (వరంగల్ రూరల్), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్ (జోగులాంబ గద్వాల), దఫేదార్ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్), బాలు నాయక్ (యాదాద్రి భువనగిరి) ఆయా జిల్లాల్లో జరిగే రాష్టర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వినూత్నంగా ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవం అనగానే సీఎం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం, జెండా ఆవిష్కరించడం, సీఎం ప్రసంగం, ఎట్‌హోం కార్యక్రమంలాంటి పలు అధికారిక కార్యక్రమాలు అందరికీ గుర్తుకు వస్తాయి. వాటితో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భాషా సాంస్కృతిక శాఖ విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్, జూబ్లీహాల్, రవీంద్రభారతిలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కవి సమ్మేళనం, ఒగ్గుడోలు కళాకారుల నృత్యం, కూచిపూడి నృత్యం, జయజయహే తెలంగాణ నృత్య రూపకం, పేరిణి నృత్యం, ఒడిస్సీ నృత్యం, అవతరణ ఫిల్మోత్సవం, షార్ట్‌ఫిల్మ్‌ల స్క్రీనింగ్ వంటి పలు కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూలతో అలంకరించిన అమరవీరుల స్తూపం 48 గంటల ‘ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్’ ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్‌కి పదును పెట్టుకుంటూ కొత్త కథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కేంద్రంగా సినీవారం, సండే సినిమా కార్యక్రమాలను రూపొందించారు. ప్రతిఏటా నిర్వహించే పోటీలా కాకుండా ఈ సంవత్సరం అవతరణ ఫిల్మోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 48 గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ మారథాన్ గతనెల 24 సాయంత్రం 7 గంటలకు మొదలై 26 సాయంత్రం ఏడు గంటలకి ముగిసింది. భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్ లేదా కేరెక్టర్ని వాడి నాలుగు నుంచి ఎనిమిది నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయడం ఇందులో ప్రత్యేకత. విజేతలకు జూన్ 3న రవీంద్రభారతి లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. మాధ్యమాల ద్వారా చేరువవుతున్న తెలంగాణ సంస్కృతి ప్రజలకు తొందరగా చేరువయ్యే ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు యువత తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్ప డానికి కృషిచేస్తున్నారు. గానం, నృత్యం, హావభావాలు, వేషధారణ వంటి అంశాలు ప్రస్ఫుటంగా కనిపించేలా షార్ట్‌ఫిల్మ్ తీయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న నెటిజన్ల సంఖ్య, యూట్యూబ్, అంతర్జాలవాడకం వం టి పలు అంశాలను పరిగణనలోకి తీసు కుని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి సంవత్సరం జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ‘ఫిల్మోత్సవం’పేరిట షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. ఈసారి భిన్నంగా వేడుకలు ‘‘రవీంద్ర భారతిలో మూడు రోజులపాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మొదటిరోజు అవార్డుల కార్యక్రమం, రెండోరోజు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యం, గానం, అదేవిధంగా సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, తెలంగాణ గీతాలు, జూన్ 2న ఉదయం కవిసమ్మేళనం, సాయంత్రం చైతన్య గీతాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రతియేటా నిర్వహించే అవతరణ దినోత్సవానికి కొంచెం భిన్నంగా 48 గంటల్లో ఫిల్మ్‌మేకింగ్ ఛాలెంజ్‌ని నిర్వహించాలనుకున్నాం. ఔత్సాహిక యువత తమ ప్రతిభను మెరుగుపరచడానికి సినీవారం, సండేసినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. వారి ప్రతిభను నిరూపించుకునేందుకు ఆసక్తిగల సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.’’ –మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూడాలన్నారు. ‘ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలమానం. రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ నిబద్ధతతో, పారదర్శకంగా అందరికీ అందేలా చూడాలి. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని అన్నారు. -
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్బీస్టేడియం సమీపంలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్నఖాన్లతీఫ్ఖాన్(కేఎల్కే) బిల్డింగ్‌లోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భవనంలోని సిబ్బందిని బిల్డింగ్ నుంచి బయటకు పంపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఐదో అంతస్తులో ఉన్న ఐడియా కార్యాలయంలోని ఏసీలో షార్ట్ సర్య్కూట్ సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ఫైర్ అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వర్ రూమ్ గుండా మంటలు వ్యాపించడంతో ప్రమాద స్థాయి మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని అగ్ని మాపక సిబ్బంది రక్షించింది. భవనంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఐదు ఫైరింజన్లు, క్రేన్ ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘భరత్’ సభలో సందడి వాతావరణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్’ బహిరంగ సభ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ, నటి కైరా అద్వాణీ, నటుడు ప్రకాశ్ రాజ్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లు హాజరయ్యారు. వీరందరూ ఒకే వరుసలో కూర్చొవడంతో సభలో సందడి వాతావరణం నెలకుంది. మహేశ్ అభిమానులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. నటి కైరా అద్వాణీ తెలుగులో నమస్కారం చెప్పారు. అంతేకాక హైదరాబాద్‌కి థ్యాంక్స్ అని అన్నారు. ఎన్నో మాట్లాడాలకుని ఇక్కడికి వచ్చాను. కానీ, ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు అని ఆమె అన్నారు. అంతేకాక షూటింగ్లో చేసిన ప్రయాణం చాలా స్పెషల్ అని నటి తెలిపారు. కాగా, సాధారణంగా తన సినిమాలకు చీఫ్ గెస్ట్‌లంటూ ప్రాధాన్యం ఇవ్వని మహేష్.. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్‌తో స్టేజీని షేర్ చేసుకోవడం విశేషం. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన భరత్ అనే నేనుకు దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. -
18న ర్యాంకింగ్ చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఈనెల 18న జరుగుతుంది. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. బాలబాలికలకు ప్రత్యేకంగా అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలుంటాయి. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు 18వ తేదీ ఉదయం తొమ్మిది గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు 7337578899, 7337399299 ఫోన్ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించాలి. -
అమ్మ భాష బాగు కోసం..
-
అమ్మ భాష బాగు కోసం.. సర్వశక్తులు ఒడ్డుతాం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాష గొప్పగా భాసిల్లేందుకు, వికసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతధా, సహస్రదా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భాష ఔన్నత్యాన్ని పెంచేందుకు, మరింత పరిపుష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లాల్‌బహదూర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పాల్కురికి సోమన ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై విశిష్ట అతిథులు, భాషాభిమానుల సమక్షంలో వేడుకలు మొదలయ్యాయి. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు భాష ఔన్నత్యం, భాషా వికాసానికి జరిగిన కృషి, ప్రస్తుతం కవులు చేస్తున్న ప్రయత్నం, ప్రజా సంకల్పం తదితర అంశాలను ప్రస్తావించారు. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసిన దాశరథి, కాళోజీల పేరిట పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని.. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఇటీవలే ఉత్తర్వులిచ్చామని తెలిపారు. ప్రస్తుతం భాషా పండితులు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని.. వాటిని వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వేమన, సుమతీ శతకాలు, పద్యాలు, సిద్దిపేటలో అవధానుల వైభవం, అజంత భాషగా తెలుగు ప్రత్యేకతలు వంటి అంశాలను వివరించారు. తెలుగు భాషా పాండిత్యాన్ని, అమ్మ భాషపై మక్కువను, విద్యార్థి దశలోని మధురానుభూతులను వేదికపై పంచుకున్నారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. గురువుల చేతిలో దేశ భవిష్యత్తు ‘‘గురువులంటే చిన్నచూపు చూసేవారు. గతంలో బతకలేక బడిపంతులు అనేవారు. కానీ అది చాలా తప్పు. దేశం, సమాజ భవిష్యత్తును కాపాడే మార్గం చెప్పే వారే గురువులు. దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తి వారికి ఉంది. భావిపౌరులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కంకణం కట్టుకోవాలి. రాయిలాగా ఉన్న నన్ను అశేష జనం ముందు నిలబడి నాలుగు తెలుగు మాటలు మాట్లాడే స్థాయికి తెచ్చింది గురువులే. నాకు అబ్బిన భాష వారి చలవే. చిన్నప్పుడు నాకు తెలుగు బోధించిన మృత్యుంజయశర్మ గారిని మరువలేను. ఉత్తర గోగ్రహణం పాఠం చెప్పి వ్యాకరణ దోషం లేకుండా మరుసటి రోజు అప్పగిస్తే నోట్ పుస్తకం బహుమతిగా ఇస్తానన్నారు. నేను ఇప్పుడే అప్పగిస్తానంటే చెప్పు చూద్దామని పరీక్షించారు. అమ్మవారిని తలుచుకుని ఓ ఐదు సార్లు చదివి వెంటనే అప్పగించా. నాకు బహుమతిగా పుస్తకం తెప్పించి ఇచ్చారు. అప్పట్లో నేను రాఘవరెడ్డి అనే ఉపాధ్యాయుడి ఇంట్లో ఉండి చదువుకునే వాడిని. నా ప్రజ్ఞ గమనించి తన వద్దకు పంపాల్సిందిగా గురువుగారు ఆయనకు సూచించారు. ఉదయం ఐదున్నరకు మృత్యుంజయశర్మగారి ఇంటికి వెళ్లేవాడిని.. చదువులో, సాహిత్యంలో రాయిగా ఉన్న నన్ను సానబెట్టి మార్చారు. నేను రత్నంగా మారానో, లేదోగానీ ఈరోజు ఈ మహా వేదిక వద్ద మీ ముందు నిలబడి నాలుగు మాటలు మాట్లాడేస్థాయికి రాగలిగాను. దుబ్బాక చెరువు గట్టుపై తిరుగుతూ తొమ్మిదో తరగతిలోనే పద్యాలు రాసిన. ఇలాంటి గురువులుంటే భాషకు వైభవం వస్తది. గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ లాంటి గురువులు నాకు ఎంతో ఉపయోగపడ్డారు. గుమ్మ పద్యం చెప్తే గుమ్మపాలు తాగినట్టుండేది. సిద్దిపేటలో వికసించిన సాహితీ కుసుమాలకు కొదవనేలేదు. పూత రేకంటే ఏమిటి..? 1972లో ఓసారి శోభన్‌బాబు సినిమా చూసిన.. అందులో హీరోయిన్ను వర్ణిస్తూ పూతరేకులాంటి లేత సొగసు అని పద ప్రయోగం ఉంది. పూతరేకంటే అర్థంగాక గురువును అడిగిన. అది పూలరేకు అయి ఉంటుందన్నరు. సినిమాహాలు ముందు పాటల పుస్తకం కొని చూస్తే అందులో కూడా పూతరేకనే ఉంది. గురువుగారు మరోసారి అడిగి ఆ పదం రాసుకుని విజయవాడలో తెలిసిన కవిని అడిగి పూతరేకంటే ఓ మిఠాయి పేరని తెలుసుకుని.. నాకు చెప్పిండ్రు. తనకు తెలియని విషయం నావల్ల తెలిసిందంటూ నన్ను కౌగిలించుకున్నారు. భాష, సాహిత్యం, సందేహం అడిగితే నివృత్తి చేయాలన్న తపన అప్పటి గురువుల్లో అలా ఉండేది. భాషను మరింత పరిపుష్టం చేయాలన్న తపన ఉండేది. అది ఇప్పుడు కావాలె. తేట తెలుగు పదాలు అవి.. పోతన అద్భుతంగా భాగవతాన్ని మన ముం దుంచిండు. తేటతెలుగు పదాలు జాలువారినట్టుండే పద్యాలు ఉట్టిగనే అర్ధమైతయి. ‘నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు...’ఈ పద్యాల్లో కఠిన పదాలుండవు, సమాసాలుండవు. అర్థమ య్యే సాహిత్యం మాత్రమే ఉంటది. ‘ఇందుగలడందులేడని సందేహమ్ము వలదు..’పద్యంలో అందు ఇందు ఎందెందు. ఉట్టిగనే అర్ధమైతది. ‘మందార మకరందం..’కూడా అంతే కదా.. ‘బాలరసాలసాల నవపల్లవ..’అంటూ సాగిపోతుంది. ‘పాలసంద్రంలో పవళించేవాడు పరుల ఇండ్ల పాలుకోరనేల..’అంటూ అవసరమైతే దేవుడినే ధిక్కరించే ఆగ్రహం కవుల సొంతం. తెలంగాణలోనూ ఇలాంటి ధిక్కార స్వరం వినిపించిన కవులు ఎందరో ఉన్నారు. అప్పట్లో జీవిత సారాన్ని వివరించే సాహిత్యం విరివిగా అందుబాటులో ఉండేది..’’ తెలంగాణ కవులకు కితాబు ఆనాడు అద్భుత సాహిత్యాన్ని పండించిన కవుల తరహాలోనే ఇప్పుడు తెలంగాణలోనూ కవులు భాషకు వన్నె తెస్తున్నారని కేసీఆర్ అభినందించారు. గోరటి వెంకన్న రాసిన పాటలు వింటే అందులో వర్ణన మన కళ్లముందే ఉన్నట్టు అనిపిస్తుందని, కొన్ని కన్నీళ్లు తెస్తాయని చెప్పారు. ‘గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది..’, ‘సంత మా ఊరి సంతా..’లాంటి పాటలను ఉదహరించారు. గోరటి అద్భుత వాగ్గేయకారుడని ప్రశంసించారు. జయజయహే తెలంగాణ గీతం రాసిన అందెశ్రీ, వానమ్మా వానమ్మా అంటూ గీతం రాసి ఆలపించిన జయరాజ్ తదితరులను ఉదహరించారు. అవధాని నాగఫణిశర్మ పద్యాలు ఆలపించి ఆకట్టుకుంటారని, తాను చిన్నప్పుడు పెరిగిన దుబ్బాక వెంకటరావుపేటలో కవులు ఎన్నో కావ్యాలు రాశారని చెప్పారు. తెలంగాణలో కవులు చాలామంది ఉన్నారని, సమయాభావం వల్ల పేర్లు చెప్పలేకపోయినందుకు క్షమించాలని కోరారు. సాహిత్యం సంస్కారాన్ని ఇస్తుంది ‘‘అమ్మ ఒడే తొలి బడి, అక్కడి నుంచే మన జీవిత ఒరవడి, మన నడవడి మొదలవుతుంది. అమ్మ ‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలి పరమానంద రామగోవిందా...’అని పాడుతూ తన పిల్లలు రాముడు, గోవిందుడిలా ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటుంది. ప్రపంచానికి తన బిడ్డను, తన బిడ్డకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇందులో పద్యాలు, సాహిత్యానిదే ప్రధాన భూమిక. మా నాన్న చక్కటి గమనాన్ని సూచించారు. ‘శ్రీరాముని దయచేతను..’పద్యంలో ఇదే విషయం దాగి ఉంది. సాధారణంగా సరస్వతీ దేవి గుడిలో.. లేకుంటే ఏదో ఓ మందిరంలో అక్షరాభ్యాసం చేసి బడిలో వేస్తారు. ఊళ్లో బడి లేకుంటే అయ్యవారి బడికి పంపుతారు. నేను అలా అయ్యవారి బడికే వెళ్లా. అక్కడే మంచి నడవడిక అలవడింది. ‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారునేరును ద్విజుడున్’పద్యంలో చెప్పినట్టు.. జీవితంలో ముఖ్యమైన అండదండలు అవసరం. ఆ పద్యం చదివాక నాకో సందేహమొచ్చింది. ‘మన ఊళ్లో నిరంతరం పారే యేరు లేదుకదా..’అని మా గురువును అడిగితే... నిత్యం జలసిరి ఉండే చెరువులున్నా చాలని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు మంచి సంస్కారం, అవగాహనను మన సాహిత్యం అందిస్తుంది..’’ దృఢ సంకల్పం అవసరం.. తెలంగాణ గడ్డపై అద్భుతంగా వికసించి, విలసిల్లిన తెలుగు భాషా సాహిత్యం మరింత పరిపుష్టం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలుగు భాషను రక్షించుకోవాలనే దృఢ సంకల్పం అవసరమని ఉద్ఘాటించారు. ‘‘ఈ సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఒక్కటే విన్నపం. భాషకు ఎల్లలు లేనందున ఈ మాట చెప్తున్నా.. ఒక భాషా పండితుడు మరో భాషా పండితుడిని తయారు చేయాలి. ఒక కవి మరో కవిని తయారు చేయాలి. ఈ భాషా వికాస యజ్ఞానికి ప్రతి తెలుగువాడు నడుం బిగించాలి..’’ అని సీఎం పిలుపునిచ్చారు. కోటి గొంతుల వీణలు: గవర్నర్ ప్రపంచ తెలుగు మహాసభలు కోటి గొంతుల వీణలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మహా సభల ప్రారంభోత్సవంలో అభివర్ణించారు. భాష, బతుకు మధ్య అవినాభావ సంబంధం ఉందని, తెలుగు మహాసభలు భువన విజయంలా సాగుతున్నాయన్నారు. గుండె నిండుగా తెలుగు పండుగ జరుగుతోందన్నారు. తెలుగు భాష కమ్మదనాన్ని భావితరాలకు మహాసభలు పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న తొలి తెలుగు మహాసభల్లో పాల్గొనడం మధురానుభూతి అని, ఎందరో మహానుభావులు తెలుగు భాషను సుసంపన్నం చేశారని కొనియాడారు. అవధానం తెలుగు వారికే సొంతం కావడం గర్వకారణమన్నారు. తెలుగు భాష అత్యంత పురాతనమైనదని, అజరామరమైనదని తెలిపారు. ఆంగ్ల మోజు తగ్గించుకుంటేనే.. అన్య భాషలపై ఆసక్తితో అమ్మ భాషను విస్మరించటం సమంజసం కాదని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లినా మనం ఆంగ్లాన్ని వదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష పరిరక్షణకు కమిటీ వేయాలని, ఇందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. మాతృభాషలోనే విద్యా బోధన అవసరమని యునెస్కో పేర్కొన్న విషయాన్ని అంతా గుర్తించాలని పేర్కొన్నారు. ఇంట్లో తెలుగు మాట్లాడి బడిలో ఆంగ్లం చదివితే విద్యార్థుల మేధస్సు పరిణతి చెందదన్నారు. ఏడాదిలో 365 రోజులు ఉంటాయన్న విషయాన్ని భాస్కరాచార్యులు వెయ్యేళ్ల క్రితమే చెప్పారని, ఆర్యభట్టు ప్రపంచానికి శూన్యం (సున్న) విలువ తెలియజెప్పిన తీరును ప్రపంచమంతా శ్లాఘిస్తుంటే.. మనం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తెలుగు బడుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణవాదిని: అసదుద్దీన్ ‘నేను ఢిల్లీలో ఉన్నçప్పుడు దక్షిణ భారతీయుణ్ని, తెలంగాణలో తెలంగాణవాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే హైదరాబాదీని’అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన తెలుగు ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ–ముస్లింల ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని, పాలు–నీళ్లలా కలిసిపోయారని ఆయన అన్నారు. పాతబస్తీకి చెందిన హమీదుల్లా షరీఫ్.. పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారని, గఫూర్ తెలుగులో ఎన్నో సాహితీ ప్రక్రియలు రాశారని గుర్తు చేశారు. ఉర్దూ, తెలుగు భాషలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. తొలిసారి తెలుగులో ప్రసంగించిన అసదుద్దీన్.. తన ప్రసంగంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మన్నించాల్సిందిగా ఉర్దూలో సభకు విజ్ఞప్తి చేశారు. -
సమైక్య శంఖారావానికి వరుణుడి మద్దతు!
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి వరుణుడు కూడా మద్దతు పలికాడు. గత రెండు రోజులుగా నగరాన్ని తడిపిముద్ద చేసిన వరుణుడు సమైక్య శంఖారావం సభ సందర్భంగా నేడు విరామం ప్రకటించాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి వర్షం ఆగిపోవడంతో వాతావరణం పొడిగా మారింది. ప్రతికూల వాతావరణం తొలగిపోవడంతో సమైక్య వాదుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. గత రెండు రోజులుగా ఎండపొడ లేకుండా గడిపిన భాగ్యనగరానికి నేడు ఊరట లభించింది. ఎడతెరిపిన లేకుండా వర్షాలతో ఉక్కిరిబిక్కిరయిన నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అటు వర్షం తెరిపివ్వడంతో సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులు పోటెత్తుతున్నారు. విభజనకు వ్యతిరేకంగా తమ గళం వినిపించేందుకు ఎల్బీ స్టేడియం వైపు కదులుతున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు.