
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఈనెల 18న జరుగుతుంది. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. బాలబాలికలకు ప్రత్యేకంగా అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలుంటాయి. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు 18వ తేదీ ఉదయం తొమ్మిది గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు 7337578899, 7337399299 ఫోన్ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించాలి.