
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్బీస్టేడియం సమీపంలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్నఖాన్‌లతీఫ్‌ఖాన్(కేఎల్‌కే) బిల్డింగ్‌లోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భవనంలోని సిబ్బందిని బిల్డింగ్ నుంచి బయటకు పంపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.
ఐదో అంతస్తులో ఉన్న ఐడియా కార్యాలయంలోని ఏసీలో షార్ట్ సర్య్కూట్ సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ఫైర్ అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వర్ రూమ్ గుండా మంటలు వ్యాపించడంతో ప్రమాద స్థాయి మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని అగ్ని మాపక సిబ్బంది రక్షించింది. భవనంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఐదు ఫైరింజన్లు, క్రేన్ ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment