Traffic Diversions In Hyderabad LB Stadium Surroundings, Check Diverted Routes Details - Sakshi
Sakshi News home page

Hyd Traffic Diversions: వాహనదారులకు అలర్ట్‌ ఈ రూట్స్‌లో వెళ్లకండి.. ట్రాఫిక్‌ మళ్లింపులు కలవు

Published Mon, Aug 22 2022 8:58 AM | Last Updated on Mon, Aug 22 2022 10:08 AM

Traffic Diversions In LB Stadium Surroundings In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, నేడు(సోమవారం) తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగునున్నాయి. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. 

ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు.. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నట్టు పోలీసులు సూచించారు. 

ట్రాఫిక్‌ మళ్లింపు వివరాలు ఇవే..
- చాపెల్‌రోడ్‌, నాంపల్లి వైపు వచ్చే వాహనాలు పీసీఆర్‌ వైపు మళ్లింపు.. 
- బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు గన్‌ఫౌండ్రీ వైపు మళ్లింపు..
- రవీంద్ర భారతి నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు..
- నారాయణ గూడ నుంచి వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్‌ వైపు మళ్లింపు.

ఇది కూడా చదవండి: మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement