గుంటూరు : ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జూన్ 24న గుంటూరులో విందు ఏర్పాటు చేసినట్లు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం తెలిపారు. ఈ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ ఇఫ్తార్ విందు గుంటూరు నగరంలోని సన్నిధి ఫంక్షన్ హాల్ లో సాయంత్రం 6-8 గంటల మధ్య ఉంటుందన్నారు. హాల్ లోపల వేయిమంది, హాల్ బయట మరో వేయి మందికి సరిపడా ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.