
ముస్లింల అభివృద్ధికి కృషి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్సీ మహ్మద్ సలీంకు సీఎం కేసీఆర్ ఖర్జూరం తినిపించి ఉపవాసాన్ని విరమింపజేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.