‘ప్రాఫెట్ ఫర్ ద వరల్డ్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు వరుసగా రెండుసార్లు అవకాశం కల్పిస్తూ వస్తున్నారని, తాము కూడా పదేళ్ల పాటు అధికారంలో ఉండి మంచి పాలనతో పేదల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రహా్మనీ రచించిన ‘ప్రాఫెట్ ఫర్ ద వరల్డ్ (ప్రపంచానికి ప్రవక్త)’పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం నిరంతరం విషం చిమ్ముతుంటారని.. ప్రజల పక్షాన మాట్లాడేవారి కంటే విషం చిమ్మేవారు ఎక్కువైపోయారని వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మజ్లిస్ కలసి రావడం ఆనందంగా ఉంది
ప్రభుత్వాన్ని నడిపించడంలో కొన్ని తప్పిదాలు జరగవచ్చని, వాటిని ఎత్తి చూపేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో అంతా కలిసి రావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రాజకీయంగా విభేదించినా.. తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కలసి రావడం అనందంగా ఉందని చెప్పారు.
మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో కొందరు పేదలు నివాసాలు కోల్పోయే అవకాశం ఉందని, వారికి ప్రభుత్వపరంగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. అన్ని మతాలు చెప్పింది ఒక్కటేనని, అందరం కలసిమెలసి శాంతియుతంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టెమ్రిస్ వైస్‌చైర్మన్ ఫహీమ్ ఖురేïÙ, ఇస్లామిక్ స్కాలర్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment