
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనుంది. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఇఫ్తార్ విందు ఉంటుందని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆతిథ్యమిస్తారని ఆ పార్టీ మైనారిటీ విభాగం నేత నదీమ్ జావెద్ చెప్పారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక ఆయన ఇస్తున్న తొలి ఇఫ్తార్ విందు ఇదే.
కాంగ్రెస్ చివరిగా 2015లో ఇఫ్తార్ విందు ఇచ్చింది. 2016, 2017ల్లో ఆ కార్యక్రమ నిర్వహణకు దూరంగా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేందుకు ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్న తరుణంలో కాంగ్రెస్ మళ్లీ ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. కార్యక్రమానికి పలు పార్టీల్లోని అన్ని మతాలకు చెందిన నేతలు, పలువురు రాయబారులు హాజరవుతారు.
Comments
Please login to add a commentAdd a comment