హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష
గుంటూరు ఈస్ట్: ఈనెల 24న రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా జరిగే ఇఫ్తార్‌విందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరుకు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 24వ తేదీ సాయంత్రం 6.47గంటలకు సన్నిధి కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొనేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆ రోజు సాయంత్రం 6 గంటలకే సీఎం విచ్చేసే అవకాశముందని, నమాజ్,ఇఫ్తార్ విందు కార్యక్రమాలతో పాటు మత పెద్దలతో సమావేశమయ్యే అవకాశముందని తెలిపారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా మొత్తం సుమారు 2 వేల మంది హాజరుకానున్నారని చెప్పారు. అలాగే 25వ తేదీ ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి తుళ్ళూరుకు విచ్చేస్తున్నట్లు చెప్పారు.
అక్కడ 6 వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ఎన్.టి.ఆర్. క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని, అనంతరం రైతులకు ప్లాట్లు పంపిణీ చేస్తారని చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.