బాలీవుడ్ భామ ఆదా శర్మ నటించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' సంచలన విజయం సాధించింది. కేరళలోని అమ్మాయిలను మతం పేరుతో విదేశాలకు తరలించారనే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది బస్తర్ సినిమాతో మార్చి 15న ప్రేక్షకులను పలకరించింది. గతంలో బస్తర్‌లో జరిగిన మావోయిస్టుల దాడి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అయితే తాజాగా ఆదా శర్మ ముంబైలో జరిగిన ఓ ఇఫ్తార్ విందుకు హాజరైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో మెరిసింది. ఈ విందుకు సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, మునావర్ ఫరూఖీ, ప్రీతి జింటా, ప్రియాంక చాహర్ చౌదరి, షెహనాజ్ గిల్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ది కేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదాశర్మ ఇఫ్తార్ విందుకు హాజరు కావడంపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. ‘ఎంత మోసం.. ముస్లింలపై ద్వేషపూరిత సినిమాలు తీస్తారు.. ఇప్పుడేమో బిర్యానీ కోసం ఆహ్వానించగానే మంచివాళ్లు అయిపోయారా?’ అంటూ ఆదా శర్మ పార్టీలో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ది కేరళ స్టోరీ నటి స్పందించింది.
దీనిపై అదా శర్మ స్పందిస్తూ.. 'అప్పుడైనా..ఇప్పుడైనా ఉగ్రవాదులు అంటే విలన్లు. అంతేకాని ముస్లింలు కాదు' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా.. కేరళలో అమ్మాయిలను బలవంతంగా మతమార్పిడి చేసి విదేశాలకు తరలించారనే నేపథ్యంలోనే ది కేరళ స్టోరీని రూపొందించారు. అయితే గతంలో తాము ఈ సినిమాను ఏ మతానికి వ్యతిరేకంగా నిర్మించలేదని తెలిపారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నవారంతా మా పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కాగా.. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించారు.
On odd and even days dear sir terrorists are villains . Not muslims.
— Adah Sharma (@adah_sharma) March 26, 2024
What a fraud she is!!!
On Odd Days Muslims are Villains for these people and you make hate movies against them!!!
On Even Days Muslims are great for these people because you get invited for a Biryani!!! pic.twitter.com/ygNhPNMnkO— Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) March 25, 2024
Comments
Please login to add a commentAdd a comment