ఖతార్‌లో ఇఫ్తార్‌.. హాజరైన కడప ఎమ్మెల్యే | Kadapa MLA Attendees Iftar Hosted By YSRCP Qatar Leaders | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 13 2018 8:32 PM | Last Updated on Wed, Jun 13 2018 8:40 PM

Kadapa MLA Attendees Iftar Hosted By YSRCP Qatar Leaders - Sakshi

దోహా, ఖతార్‌ : గల్ఫ్‌ దేశాలైన ఖతార్‌, కువైట్‌లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖతార్‌ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజద్‌ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్‌ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఖతార్‌ రాజధాని దోహాలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖతార్‌ కో-కన్వీనర్‌ గోవింద నాగారాజు ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌బీ అంజద్‌ బాషా మాట్లాడుతూ.. మత సామారస్యనికి ప్రతీక అయిన ఇఫ్తార్‌ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశం కాని దేశంలో ఉంటూ కూడా పార్టీ అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున తమకు ఘన స్వాగతం పలికి భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని అన్నారు.

పార్టీ కోసం మీరు శ్రమిస్తున్న దానికి పార్టీ అధిష్ఠానం, తాము రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే కో కన్వీనర్‌ నాగారాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నిలో విజయం సాధించి ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రుల సమస్యలను కో-కన్వీనర్లు, గవర్నింగ్‌ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించగా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని హామి ఇచ్చారు. కార్యక్రమానికి హాజరై, విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యేలను కువైట్‌, ఖతర్‌ వైసీపీ ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కువైట్‌, ఖతార్ ముఖ్యనాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement