వైఎస్సార్‌సీపీ నాయకుడు రసూల్ సాహేబ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.