ఆర్ఎస్ఎస్ ఇఫ్తార్ విందు
Published Mon, Jun 20 2016 7:58 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
న్యూఢిల్లీ: హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇవ్వనుంది. పార్లమెంటు భవనంలో జులై 2 న ఆ సంస్థ విభాగమైన ముస్లీం రాష్ట్రీయ మంచ్(ఎమ్ఆర్ఎమ్) ఈ విందును ఇవ్వనుందని సంస్థ ప్రతినిధి ఇంద్రేష్ కుమార్ తెలిపారు. పాకిస్థాన్ తో పాటు 140 దేశాల రాయబారులను ఈ విందుకు ఆహ్వానించనున్నారు.
ఈ విందులో ముస్లింలు, ముస్లిమేతర మేధావులు పాల్గొంటారని కుమార్ తెలిపారు. భారతదేశంలో అంన్ని మతాల వారికి భద్రత ఉంటుందని చాటడమే ఈ విందు ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ముస్లింలకు పూర్తి రక్షణ ఉంటుందని తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఎమ్ఆర్ఎమ్ ఛీఫ్ మహ్మద్ అఫ్జల్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement