అలీగఢ్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ మరోసారి ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిపురలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలోని ముస్లింలందరూ హిందువులేనని అన్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, దేశంలోని ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరుకుంటున్నట్లు ఆయన సష్టం చేశారు.
మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం తప్పులేదని మహంత్ షకున్‌పాండే అన్నారు. భారత్‌లో నివసించే వారంతా హిందువులేనని.. అందులో ఎటువటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు ముస్లింలుగా చెప్పుకుంటున్న వారంతా తమ నేపథ్యాన్ని పరిశీలించుకోవాలని ఆయన అన్నారు. ఒక్కసారి నేపథ్య పరిశీలన చేసుకుంటే.. వారికి కూడా తామంతా హిందువులమేనన్న వాస్తవం తెలుస్తుందని చెప్పారు.
మహంత్ ధర్మదాస్ మహారాజ్ మాత్రం మోహన్ భగవత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల.. హిందువులు, ముస్లింలకు ఎటువంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని భగవత్‌ను ధర్మదాస్ ఆగ్రహంగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment