కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ(పాత చిత్రం)
సాక్షి, సంగారెడ్డి జిల్లా : సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరాంసాగర్‌కు తీసుకుపోయే హక్కు కేసీఆర్‌కు, హరీష్‌కు ఎవరిచ్చారని శాసన మండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..వర్షాలు లేటైతే సింగూరు ఆయకట్టు కింద ఉన్న జిల్లాల రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో సునామీ రాబోతుందని, కాంగ్రెస్ విజయం తథ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తు రూ.2 లక్షల రుణ మాఫీ తప్పక చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో ఇఫ్తార్, క్రిస్మస్ వేడుకలను రద్దు చేసుకోవాలన్న రాష్ట్రపతి నిర్ణయాన్ని షబ్బీర్ అలీ తప్పుపట్టారు. రాష్ట్రపతి నిర్ణయానికి నిరసనగా గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు తాను హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.
నోటిఫికేషన్‌లు, రీ నోటిఫికేషన్‌లు తప్ప రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదని, రైతు బంధు పథకం ద్వారా సామాన్య రైతుల కంటే భూస్వాములకు మాత్రమే లబ్ది జరిగిందని తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. స్తోమత ఉన్న రైతులకు, సాగు చేయని భూస్వాములకు లబ్ది జరిగితే ఫలితం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రానికి మంజూరైన నిధులను కూడా దారి మళ్లించారని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment