రేపు కడపలో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు | kadapa ysrcp iftar party on july 5th | Sakshi
Sakshi News home page

రేపు కడపలో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు

Published Mon, Jul 4 2016 9:25 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

kadapa ysrcp iftar party on july 5th

 హాజరుకానున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కడప: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద దర్గా సమీపంలోని అమీన్ ఫంక్షన్ హాలులో ‘దావతే-ఏ- ఇఫ్తార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ తెలిపారు.

ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. అలాగే జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీఛైర్మన్, మేయర్, కార్పొరేటర్లు, వైఎస్‌ఆర్‌సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొననున్నారని చెప్పారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలు, నగర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు షేక్ అన్సర్‌బాషా, షేక్ గయాజ్, బాబు, రఫీఖ్‌ఖాన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement