
పార్టీలంటే మహేశ్-నమ్రత ఎప్పుడూ జంటగానే వెళ్తారు.

కానీ ప్రస్తుతం రాజమౌళి మూవీ వల్ల మహేశ్ బయటకు రాకూడదు కాబట్టి నమ్రత ఒక్కతే పార్టీలకు వెళ్తోంది.

ఈమెకు తోడుగా చరణ్-ఉపాసన కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు.

తాజాగా అలాంటి మరో పార్టీ జరిగింది.నమ్రత-ఉపాసనలకు ఫ్రెండ్ అయిన షీమా నజీర్.. శుక్రవారం రాత్రి ఇఫ్తార్ పార్టీ ఇచ్చింది.

ఈ వేడుకకు వీళ్లిద్దరు మాత్రమే హాజరయ్యారు.

మహేశ్ ఎలానూ ఇప్పుడు రావడానికి కుదరదు. కానీ ఈసారి చరణ్ కూడా రాలేకపోయాడు. దీంతో నమ్రత-ఉపాసన మాత్రమే పార్టీకి వచ్చినట్లు కనిపిస్తుంది.తాజాగా నమ్రత..

కొన్ని ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వీటిలో ఈమెతో పాటు ఉపాసన.. ముస్లిం ట్రెడిషన్ కి తగ్గ లుక్స్ లో కనిపించడం విశేషం.

ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తోందిగా. మళ్లీ పండగ రోజు వీళ్లు ఏమైనా పార్టీ చేసుకుంటారేమో చూడాలి?