ముస్లింలకు సీఎం రంజాన్ కానుకలు, వరాలు
రంజాన్ సందర్భంగా ఈనెల 8వ తేదీన హైదరాబాద్లోని నిజాం కాలేజిలో భారీ ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మసీదులలో పనిచేసే ఇమాంలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి అందించనున్నట్లు ఆయన తెలిపారు. వారితో పాటు నమాజులకు పిలుపునిచ్చే మౌజమ్లకు కూడా ఈ భృతి ఇస్తామన్నారు. గురువారం పలువురు సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించిన అనంతరం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
- ఈనెల 8న నిజాం కాలేజి వేదికగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తాం
- నాతోపాటు అందరు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు
- పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిసత్ఆం
- హైదరాబాద్లో సీఎస్ ఆధ్వర్యంలో జీఏడీ నిర్వహిస్తుంది
- జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది
- హైదరాబాద్ నగరంలో వంద మసీదులలో ఈసారి ప్రభుత్వం పక్షాన దావతె ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నాం
- జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఒక మసీదులో ప్రభుత్వ పక్షాన ఇఫ్తార్ విందులు ఇస్తాం
- ప్రతి మసీదు వద్ద వెయ్యిమందికి భోజన ఏర్పాట్లు చేస్తాం
- రంజాన్ సందర్భంగా 1.95 లక్షల మంది ముస్లిం నిరుపేద కుటుంబాలకు రూ. 500 విలువైన దుస్తులు పంచిపెడతాం
- మసీదుల ఇమాంలు, కమిటీ ఆధ్వర్యంలో వీటిని పంచుతారు
- 1.95 లక్షల మందికి అదే రోజు భోజనాలు కూడా ఏర్పాటుచేస్తాం
- గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా ఈ రంజన్ నుంచి మొదలుపెట్టి తెలంగాణలోని 5వేల మసీదుల ఇమాంలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇస్తాం
- మసీదు కమిటీలు సమకూర్చేదానికి ఇది అదనం
- రంజాన్కు మొత్తం రూ. 26 కోట్ల ఖర్చు అవుతోంది
- ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏకే ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నాం
- ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సలీం, ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు
- ఈ కార్యక్రమంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్లకు విజ్ఞప్తి
- ఇప్పుడు 1.95 లక్షల మందితో ప్రారంభిస్తున్నాం.
- ఈ ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది నుంచి అవసరమైతే పెంచుతాం
- రూ. 25 లక్షలతో మొత్తం రాష్ట్రంలోని అనాథ శరణాలయాల పిల్లలకు 8వ తేదీన భోజనాలు ఏర్పాటుచేస్తున్నాం
- ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేసుకుని కార్యక్రమం సాఫీగా సాగేలా చూడాలి.