ramzan celebrations
-
Bobby Deol His Wife Photos: యానిమల్ విలన్‌కు ఇంత అందమైన భార్య ఉందా..! (ఫోటోలు)
-
సల్మాన్ బ్రదర్ ఇంట ఈద్ పార్టీ.. ఏదీ ఓసారి టచ్ చేసి చూడు! (ఫోటోలు)
-
Sania Mirza Eid Photos: స్పెషల్ అట్రాక్షన్‌గా సానియా మీర్జా.. అచ్చం ఆ హీరోయిన్లా ఉందంటూ కామెంట్లు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రమజాన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముస్లీంల పవిత్ర పండుగ రమజాన్ ను తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. కులమతాలకు అతీతంగా సోదరభావంతో ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ముస్లీం ప్రార్థనల కొసం ఈద్గా, మసీదుల వద్ద జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగర మేయర్ బొంతు రాంమోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డిలు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మాసబ్ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్ వద్ద ముస్లీం సోదరులు నమాజ్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సనత్ నగర్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట మజీద్‌లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రబాద్ చిలకలగూడ ఈద్గాలో మంత్రి పద్మారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాన్సువాడలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నల్గొండలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయవాడ: రమజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిని వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీంలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా రామవరప్పాడు రోడ్డు నిర్మాణంలో తొలగించిన మసీదును ఎందుకు నిర్మించడం లేదంటూ చంద్రబాబును ముస్లీం సోదరులు ప్రశ్నించారు. దీంతో ఏడాది లోపు మసీదు నిర్మిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. కడప: రాయచోటి పట్టణంలోని ఈద్గాలో జరిగిన వేడుకల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పార్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
మంత్రుల రంజాన్ శుభాకాంక్షలు
అనంతపురం అర్బన్: జిల్లాలో ముస్లిం సోదరులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులతోపాటు చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యా మినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్ సాహెబ్, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్లు బి. లక్ష్మికాంతం, సయ్యద్ ఖాజా మోహిద్ధీన్, డీఆర్ఓ హేమసాగర్ వేర్వేరు ప్రకటనల్లో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వారు వివరించారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి... ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాష అనంతపురం క్రైం:అల్లా కృపాకటాక్షాలతో అందరీ జీవితాల్లో సుఖసంతోషాలు కలగాలని ఎమ్మెల్యేలు విశ్వేశ్వరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా కోరారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు వారు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో జిల్లా సుభిక్షం కావాలి...అనంత అల్లా దయతో జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆనంద వెల్లివిరాయలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ఆక్షాంక్షించారు. జిల్లాలోని ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలతో వర్ధిల్లాలి... గురునాథరెడ్డి జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు, ప్రజలకు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను సుఖసంతోషాలతో ని ర్వహించుకోవాలని ఆయన కోరారు. పండుగ వేడుకల్లో హిం దూ,ముస్లింల మధ్య సోదరభావం, ఆత్మీయత వెల్లివిరుస్తుందన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని పీటీసీ ఎదురుగా ఉన్న మసీదులో ముస్లిం సోదరులకు కర్జూరాలు పంపిణీ చేశారు. -
ముస్లింలకు సీఎం రంజాన్ కానుకలు, వరాలు
రంజాన్ సందర్భంగా ఈనెల 8వ తేదీన హైదరాబాద్‌లోని నిజాం కాలేజిలో భారీ ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మసీదులలో పనిచేసే ఇమాంలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి అందించనున్నట్లు ఆయన తెలిపారు. వారితో పాటు నమాజులకు పిలుపునిచ్చే మౌజమ్‌లకు కూడా ఈ భృతి ఇస్తామన్నారు. గురువారం పలువురు సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించిన అనంతరం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఈనెల 8న నిజాం కాలేజి వేదికగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తాం నాతోపాటు అందరు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిసత్ఆం హైదరాబాద్‌లో సీఎస్ ఆధ్వర్యంలో జీఏడీ నిర్వహిస్తుంది జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది హైదరాబాద్ నగరంలో వంద మసీదులలో ఈసారి ప్రభుత్వం పక్షాన దావతె ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నాం జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఒక మసీదులో ప్రభుత్వ పక్షాన ఇఫ్తార్ విందులు ఇస్తాం ప్రతి మసీదు వద్ద వెయ్యిమందికి భోజన ఏర్పాట్లు చేస్తాం రంజాన్ సందర్భంగా 1.95 లక్షల మంది ముస్లిం నిరుపేద కుటుంబాలకు రూ. 500 విలువైన దుస్తులు పంచిపెడతాం మసీదుల ఇమాంలు, కమిటీ ఆధ్వర్యంలో వీటిని పంచుతారు 1.95 లక్షల మందికి అదే రోజు భోజనాలు కూడా ఏర్పాటుచేస్తాం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా ఈ రంజన్ నుంచి మొదలుపెట్టి తెలంగాణలోని 5వేల మసీదుల ఇమాంలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇస్తాం మసీదు కమిటీలు సమకూర్చేదానికి ఇది అదనం రంజాన్‌కు మొత్తం రూ. 26 కోట్ల ఖర్చు అవుతోంది ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏకే ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నాం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సలీం, ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు ఈ కార్యక్రమంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్లకు విజ్ఞప్తి ఇప్పుడు 1.95 లక్షల మందితో ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది నుంచి అవసరమైతే పెంచుతాం రూ. 25 లక్షలతో మొత్తం రాష్ట్రంలోని అనాథ శరణాలయాల పిల్లలకు 8వ తేదీన భోజనాలు ఏర్పాటుచేస్తున్నాం ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేసుకుని కార్యక్రమం సాఫీగా సాగేలా చూడాలి.