అనంతపురం అర్బన్: జిల్లాలో ముస్లిం సోదరులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులతోపాటు చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యా మినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్ సాహెబ్, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్లు బి. లక్ష్మికాంతం, సయ్యద్ ఖాజా మోహిద్ధీన్, డీఆర్‌ఓ హేమసాగర్ వేర్వేరు ప్రకటనల్లో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వారు వివరించారు.
అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి...
ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాష
అనంతపురం క్రైం:అల్లా కృపాకటాక్షాలతో అందరీ జీవితాల్లో సుఖసంతోషాలు కలగాలని ఎమ్మెల్యేలు విశ్వేశ్వరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా కోరారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు వారు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.
అల్లా దయతో జిల్లా సుభిక్షం కావాలి...అనంత
అల్లా దయతో జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆనంద వెల్లివిరాయలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ఆక్షాంక్షించారు. జిల్లాలోని ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
సుఖసంతోషాలతో వర్ధిల్లాలి... గురునాథరెడ్డి
జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు, ప్రజలకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను సుఖసంతోషాలతో ని ర్వహించుకోవాలని ఆయన కోరారు. పండుగ వేడుకల్లో హిం దూ,ముస్లింల మధ్య సోదరభావం, ఆత్మీయత వెల్లివిరుస్తుందన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని పీటీసీ ఎదురుగా ఉన్న మసీదులో ముస్లిం సోదరులకు కర్జూరాలు పంపిణీ చేశారు.
మంత్రుల రంజాన్ శుభాకాంక్షలు
Published Sat, Jul 18 2015 2:57 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement