
ప్రముఖ నటుడు బాబీ డియోల్ గతేడాదే యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇందులో విలన్‌గా నటించిన ఈయన ప్రస్తుతం కంగువా, హరిహర వీరమల్లుతో పాటు బాలకృష్ణ మూవీలోనూ నటిస్తున్నాడు.

గురువారం (ఏప్రిల్ 11న) ఇతడు తన భార్య తాన్య డియోల్‌తో కలిసి సల్మాన్ బ్రదర్స్ ఏర్పాటు చేసిన ఈద్ పార్టీకి హాజరయ్యాడు.

తాన్యను చూసిన సౌత్ ప్రేక్షకులు.. బాబీ డియోల్‌కు ఇంత అందమైన భార్య ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా కెమెరా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడని ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు.

తాన్య డియోల్ ఇంటీరియర్ డిజైనర్.. అలాగే ఫ్యాషన్ డిజైనర్ కూడా.

ఇంటీరియర్ డిజైన్‌లో డిప్లొమా పూర్తి చేసిన ఆమెకు ముంబైలో ఫర్నీచర్ షాప్ కూడా ఉంది. జుర్మ్, నానే జైసల్మీర్ వంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పని చేసింది.








