'ఇంచు భూమి కోల్పోయిన కేసీఆరే బాధ్యుడు' | T Jeevan Reddy takes on Telangana Chief Minister K. Chandrashekar Rao | Sakshi
Sakshi News home page

'ఇంచు భూమి కోల్పోయిన కేసీఆరే బాధ్యుడు'

Published Wed, Jul 16 2014 2:19 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM

'ఇంచు భూమి కోల్పోయిన కేసీఆరే బాధ్యుడు' - Sakshi

'ఇంచు భూమి కోల్పోయిన కేసీఆరే బాధ్యుడు'

కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇంచు భూమి కోల్పోయిన అందుకు బాధ్యత సీఎం కేసీఆర్దే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ... పోలవరం ముంపు మండలాలను కాపాడటంలో కేసీఆర్ విఫలమైయ్యారని ఆరోపించారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి పోలవరం ప్రాజెక్టు నిర్మించడం సాధ్యం కాదని జీవన్ రెడ్డి వెల్లడించారు.

 

పోలవరం ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లోని ఇరు సభలు ఆమోదించాయి. దాంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిశాయి. ఈ నేపథ్యంలో ఆ ఆర్డినెన్స్ బిల్లును అడ్డుకోవడంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం అసక్తి కనబరచలేదని జీవన్ రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement