t jeevan reddy
-
కేసీఆర్ చదివిన బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది
సాక్షి, జగిత్యాల: దీర్ఘకాలిక లక్ష్యాలతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాలను జోడుగుర్రాల్లా పరిగెత్తించడమే కాంగ్రెస్ లక్ష్యమని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సాక్షితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ పాలనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షస పాలనగా అభివర్ణించారు. కానీ, ఆయన చదువుకున్న బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది. నాకు ఇవే చివరి ఎన్నికలంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ మాట నేనెప్పుడూ అనలేదు. ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీ ఉంది కదా.. మళ్లీ ఎమ్మెల్యే బరిలోకి ఎందుకు దిగుతున్నానంటూ కొందరు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య తేడాల్ని గుర్తించాలివాళ్లు.. అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు కౌంటర్ ఇచ్చారాయన. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్లకు.. పొలాస అగ్రికల్చర్ కాలేజ్, జేఎన్టీయూ, న్యాక్ వంటి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారాయన. వైఎస్సార్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉంటూ జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారాయన. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసి తీరుతామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి పది నుంచి పదకొండు సీట్లు కాంగ్రెస్‌వేనని ధీమా వ్యక్తం చేశారు జీవన్‌రెడ్డి. -
పెద్దాయనను ఎందుకు దించాలనుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిల మధ్య బుధవారం అసెంబ్లీ ప్రాంగణం వేదికగా సరదా సంభాషణ చోటుచేసుకుంది. త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తల నేపథ్యంలో వీరిరువురి నడుమ ఆసక్తికర చర్చ సాగింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సమావేశం తర్వాత తన చాంబర్‌కు వెళుతున్న ఎమ్మెల్యేకు అటుగా వచ్చిన ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పలకరించారు. మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రశ్నించగా.. అంతా మీ అభిమానం అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. పెద్దాయన (కేసీఆర్)ను అప్పుడే ఎందుకు దించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించగా.. దేశంలో రైతులకు కేసీఆర్ అవసరం ఉంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. కేసీఆర్ ప్రధాని అయ్యాక కేటీఆర్ గురించి మాట్లాడండి. అప్పుడే ఎందుకు దించాలనుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చలోక్తి విసిరారు. తర్వాత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని గతంలో టీఆర్ఎస్లో చేరమని ఆహ్వానాలు అందిన అంశంపై ఇద్దరి మధ్య సంభాషణ సాగింది. కాంగ్రెస్‌లో ఉన్న టి.జీవన్‌రెడ్డి.. టీఆర్ఎస్లోకి రాకపోవడంతో టీఆర్ఎస్లో కూడా ఒక జీవన్‌రెడ్డిని తయారు చేశారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనడంతో నవ్వులు విరిశాయి. చదవండి: (తమిళనాడులో బీజేపీకి కేసీఆర్ సహకారం) సీఎం దూరదృష్టి వల్లే విద్యుత్ రంగం పురోగతి పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూరదృష్టి వల్లే విద్యుదుత్పత్తిలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా మారడంతో పాటు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని శాసన సభ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ (పీయూసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ కమిటీ హాల్లో బుధవారం కమిటీ చైర్మన్ జీవన్‌రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన పీయూసీ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలను సమీక్షించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయనతోపాటు కమిటీ సభ్యులు మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రావు మీడియాతో మాట్లాడుతూ...అంధకారంలో ఉన్న తెలంగాణను రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి వెలుగులోకి తెచ్చారని, రాష్ట్ర అవతరణకు ముందు స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 16వేల మెగావాట్లకు చేరిందన్నారు. విద్యుత్ రంగాన్ని మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.29 వేల కోట్లు ఖర్చు చేసినా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిపారు. 2014లో రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే విద్యుదుత్పత్తి పుష్కలంగా ఉండటంతో పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని మనోహర్‌రెడ్డి అన్నారు. గతంలో విద్యుత్ సమస్యల మూలంగా రైతాంగం తీవ్రంగా నష్టపోవడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపిందని, రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ప్రసాదించిన సీఎం కేసీఆర్ దేవుడని భాస్కర్‌రావు వ్యాఖ్యానించారు. -
అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున పంజాబ్, మహారాష్ట్ర తరహాలో విద్యార్థుల అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడింగులివ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, ఇతర జాతీయ స్థాయి కోర్సుల్లో చేరే విషయంలో ఆందోళనలో ఉన్నారని ఆ లేఖలో తెలిపారు. వెంటనే నిర్ణయం తీసుకుని పదో తరగతి ఫలితాలు ప్రకటించడం ద్వారా తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలు పోగొట్టాలని జీవన్‌రెడ్డి కోరారు. -
జగిత్యాల జీవన జ్యోతి
భుజంపైన ఎప్పుడూ కండువా లేదా ఒక పంచె, తెల్లటి చొక్కా, పాంటుతో సాదాసీదాగా కనిపించే పౌరుడు. వృత్తి రీత్యా న్యాయవాది. రైతుబిడ్డ. కరీంనగర్ జిల్లాలోనే కాదు... రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి. వివాదరహితుడు. మృధుస్వభావి. జీవనన్నగా అందరికీ సుపరిచితుడు. అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా... " ఏదైతే ఉందో..." ఊతపదంతో చెప్పే విషయంలో వాడివేడిగా చెబుతున్న విషయంలో పస ఉంటుంది. రాజకీయాల్లో నిబద్దత కలిగిన నేత. ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర రావు, వైఎస్ఆర్ లాంటి ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసినా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిత్వం ఆయనది. కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంట ఉండి మరీ కార్యాలయాలకు వెళ్లి పనులు చక్కబెట్టే మంచితనం ఆయన సొంతం. పార్టీ సమావేశాల కన్నా స్థానిక ప్రజల కార్యక్రమాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అసెంబ్లీ లోపల బయట ఎలాంటి వివాదాలు దరిచేరనివ్వని ఆయన.. ఆగస్టు సంక్షోభంలో నాదెండ్లవైపు నిలబడటం ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక బ్రేక్ లా నిలిచిపోయింది. ఆ పరిణామం అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. వైఎస్ కేబినేట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నుంచి ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఏడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. కుటుంబ నేపథ్యం : పేరు : తాటిపర్తి జీవన్ రెడ్డి పుట్టిన తేది : 5 జనవరి, 1952 ఊరు : బతికపల్లి, పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా తల్లి దండ్రులు : లింగమ్మా, రామచంద్రారెడ్డి భార్య : అహల్యాదేవి (ముగ్గురు కుమారులు) చదువు : నిజాం కాలేజీ నుంచి బీఏ, ఉస్మానియా నుంచి ఎల్ ఎల్ బీ (జగిత్యాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు) రాజకీయ ప్రస్థానం : - 1989 లో మొదటిసారిగా మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఎన్నిక - 1983 లో టీడీపీలో చేరిక, జగిత్యాల నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగు, (ఎన్టీఆర్ కేబినేట్ లో ఎక్సైజ్ మంత్రిగా) - 1985 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి రాజేశంగౌడ్ చేతిలో ఓటమి - 1989 లో కాంగ్రెస్ నుంచి పోటీ గెలుపొంది రెండోసారి అసెంబ్లీకి - 1994 లో అన్యూహ్యంగా తెరపైకి వచ్చిన ఎల్.రమణ టీడీపీ నుంచి బరిలో దిగగా జీవన్‌రెడ్డి ఓటమి - 1996 లో రమణ ఎంపీకి వెళ్లడంతో అదే ఏడాది జగిత్యాల స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా టీడీపీపై జీవన్ భారీ మెజార్టీతో గెలుపు - 1999, 2004 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి వరుస విజయాలు - 2006, 2008 లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ ఓటమి - 2009 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి - 2014 లో టీఆర్ఎస్ గాలిని ఎదుర్కొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు - 2014 నుంచి శాసనసభ కాంగ్రెస్ పక్ష ఉపనేతగా కొనసాగారు - వి. కుమారస్వామి (సాక్షి జర్నలిజం స్కూల్) -
నేనూ మొక్కజొన్న రైతునే
జగిత్యాల అగ్రికల్చర్: ‘నేను రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించిన.. ఏం లాభం.. ఏ మాత్రం గిట్టుబాటు కాలేదు’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మార్కెట్ యార్డులో బుధవారం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న వేసిన.. ఒక్కో మొక్కజొన్న బస్తాను వెయ్యి రూపాయలు పెట్టి కొన్న. ఇక, భూమిలో తేమ లేక విత్తనాల నుంచి మొలక బాగా రాలేదు.. భూమిలో ఉన్న విత్తనాలను ఉడుతలు ఎలుకలు తిన్నయ్. కలుపు తీయించినా. ఇక పంట బాగా పండుతున్నదనుకున్న సమయంలో మొక్కజొన్న పీచుకు రాగానే రామచిలుకలు మోపైనయ్. తోటంతా తిరుగుతూ ఇనుప డబ్బాల మీద కొట్టుడు, పాత చీరలు తోటంతా కట్టించిన. గింజ గట్టి పడుతుందనుకుంటున్న సమయంలో కోతులు ఎగబడ్డాయ్. ఇవి చాలదన్నంటూ పందులు దాడులు చేసినయ్. వీటన్నింటిని ఎదుర్కొని మొక్కజొన్నను కోసి, కంకి విరిసి, బూరు తీసి, ఆరబెట్టిన. కంకి పట్టించినా.. ఇంత కష్టపడుతున్నా రెండు ఎకరాల మొక్కజొన్నకు నేను పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు’అని వాపోయారు. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మొక్కజొన్నకు ప్రస్తుతమున్న రూ.1,425 గిట్టుబాటు కాదని, రూ.2 వేలు ఉంటేనే రైతులు మొక్కజొన్న పండించే అవకాశం ఉందని, లేదంటే ఇతర పంటల వైపు మళ్లుతారని జీవన్‌రెడ్డి వివరించారు. -
మిషన్ భగీరథ అతిపెద్ద స్కాం: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న మిషన్ భగీరథ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని సీఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.40 వేల కోట్లు మిషన్ భగీరథకు వెచ్చిస్తోందని, దీనివల్ల ఒక్కొక్కరిపై రూ.20 వేల భారం పడుతోందని అన్నారు. స్థానికంగా ఫిల్టర్లు, ఆక్వావాటర్, గృహాల్లో ఫిల్టర్లు, నీటి డబ్బాలను తాగునీటి కోసం ప్రజలు వాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వమందించే నీటిని రాబోయే రోజుల్లో బట్టలుతకడానికి, బాత్రూమ్, ఇంటి అవసరాలకు వాడుకుంటా రని చెప్పారు. మిషన్ భగీరథ నీటిని తాగడానికి వాడుకునే పరిస్థితులే ఉండవన్నారు. ఈ పథకం నీరు తాగడానికి ఉపయోగ పడకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పులభారాన్ని పెంచే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించకపోగా ఇప్పటికే ఉన్న నీటి సరఫరా వ్యవస్థ, గ్రామాల్లోని రోడ్లను ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల తో కుంటలు, చెరువులు నింపాలని, దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ ప్రచార ఆర్భాటం చేసి భగీరథ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు పనులను ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వంపై, ఈ పథకంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వానిది కాలయాపనే
సాక్షి, హైదరాబాద్: మైనారిటీల సంక్షేమం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని, మైనారిటీ రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉందంటూ కాలయాపన చేస్తోందే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించట్లేదని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మైనారిటీల సంక్షేమంపై గురువారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కోర్టుకెళ్లేందుకు మానసికంగా సిద్ధమైనట్లు కనిపిస్తోందన్నారు. ‘‘12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడంతో ఆ వర్గం ప్రజల్లో ఆశలు మొలకెత్తాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కమిషన్ వేసేందుకు 10 నెలలు పట్టింది. దాని నివేదిక ఇవ్వడానికి 20 నెలలు పట్టింది. ఇప్పుడు కేంద్రానికి పంపామంటున్నారు. అది పంపి కూడా ఆరు నెలలవుతోంది. ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తాయి. ఈలోగా మీరు మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారో చెప్పాలి’’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి నిలదీశారు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు టీఆర్ఎస్ సమర్థించిందని, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవ హరించిందని, కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నా మైనారిటీ రిజర్వేషన్లపై కేంద్రం ఎందుకు సానుకూలంగా స్పందించట్లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా కనిపించట్లేదని, మైనారిటీలకు ఇప్పుడున్న 4 శాతం రిజర్వేషన్లకు మరో 6 శాతం కలిపి మొత్తం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ కమిషన్ ప్రతిపాదించగా ప్రభుత్వం ఇచ్చిన నోట్లో మాత్రం బీసీ కమిషన్ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేసిందని పేర్కొన్నదని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. ఇలాంటి అంశాలు కోర్టులో ఎలా నిలబడతాయని ఆయన ప్రశ్నించారు. మైనారిటీ రిజర్వేషన్లతోపాటు ఎస్సీ, ఎస్టీల అంశంపైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రంలో రిజర్వేషన్ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. మైనారిటీలకు బడ్జెట్లో కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్లలో 25 శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. -
చింతలూరులో ఫిల్టర్‌బెడ్ కట్టిస్తాం
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరులో యుద్ధప్రాతి పదికన వాటర్ ప్లాంట్ కట్టిస్తామని స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి చెప్పారు. వాటర్ క్లోరినేషన్ శాతం తెలు సుకునేందుకు పరీక్షలునిర్వహించాలని ఆర్డబ్ల్యూఎస్ అధి కారులను ఆదేశించారు. ‘సాక్షి’ మెయిన్‌లో ‘మరో ఉద్దానం.. చింతలూరు’శీర్షికతో ప్రచురితమైన కథనానికి జీవన్‌రెడ్డి స్పందించారు. శనివారం ఆ గ్రామాన్ని సందర్శిం చారు. కిడ్నీ వ్యాధి బాధితులను పరామర్శించారు. నాణ్యమైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. కాలనీవాసులను నడిపిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపారు. టీడీపీ – టీఆర్ఎస్ మిలాఖత్! సాక్షి, జగిత్యాల: టీఆర్ఎస్.. టీడీపీపై సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు రైతు సమ స్యలపై ఆందోళన చేపడితే.. టీడీపీ, బీజేపీలు సభలోనే ఉం డిపోయాయని విమ ర్శించారు. శనివారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, టీఆర్ఎస్ మొదటి నుంచే మిలాఖత్ అయి ఉన్నాయనీ, చంద్రబాబు కనుసన్నల్లోనే తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్లో చేరారన్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడమే దీనికి నిదర్శ నమన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. -
న్యాయం కోసమే కోర్టులకు వెళుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన బాధితులు న్యాయం కోసమే కోర్టులకు వెళుతున్నారని, న్యాయస్థానాలకు వెళ్లిన వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు 20నుంచి 30వేల ఎకరాలు అవసరం అవుతుందని, దీంతో పెద్ద సంఖ్యలోనే భూములు కోల్పోయినవారు ఉంటారన్నారు. బాధితులు కోరుకున్న మేరకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మేడారం రిజర్వాయర్ పనుల్లో జాప్యంతో ఆయకట్టు రైతులు బాధితులవుతున్నారని అన్నారు. ఎస్సారెస్పీ 40 టీఎంసీలకు చేరుకోకుండానే తాగు నీటి అవసరాల కోసం మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారని, దీనివల్ల ఆయకట్టు రైతులు తమ పంటలకు నీరందక ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ఎస్సారెస్పీ కింద మొదటి పంటకు నీరందలేదని, ఇప్పుడు రెండో పంటకు కూడా అందకుండా పోతోందని అన్నారు. -
నేను, సీఎం..దోస్తులమే..
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి రాయికల్ (జగిత్యాల): ముఖ్యమంత్రి కేసీఆర్, తాను దోస్తులమని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్యలో గురు వారం విలేకరులతో మాట్లాడారు. అయితే, తమ పార్టీ సిద్ధాంతాలు వేరు కావడంతో కొంతవరకు ప్రజలు సమస్యలపై పోరాడుతు న్నామేగానీ తమ మధ్య ఎలాంటి విద్వేషాలూ లేవని చెప్పారు. -
కేసీఆర్ కంటే ముందే మంత్రిగా పనిచేశా..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కంటే ముందుగానే మంత్రి పదవి చేసిన తనపై ఆయన పిల్లలైన మంత్రి కె.తారకరామారావు, ఎంపీ కవితలు అహంకారపూరితంగా, అధికారగర్వంతో మాట్లాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్‌ను ప్రమోట్ చేసుకోవడానికి పెట్టిన జగిత్యాల సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ‘అధికారగర్వంతో, అహంకార పూరితంగా కేటీఆర్, కవిత మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను పాతరపెడ్తారా? మిగులుబడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన టీఆర్ఎస్ విధానాలను విమర్శిస్తే కాంగ్రెస్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడ్తారా? కేవలం మూడేళ్ల పసిగుడ్డు పాలనతో రాష్ట్ర బడ్జెట్ లక్షన్నరకోట్లకు వచ్చిందా? కాంగ్రెస్ అభివృద్ధి ఏమీ చేయలేదా? టీఆర్ఎస్ ఇంకా ఉద్యమంలోనే ఉందా, ప్రభుత్వంలో ఉందా అనేది మాట్లాడటానికి ముందు ఆలోచించుకోవాలి’ అని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ‘నాకు మంత్రి పదవికోసమే కరీంనగర్ ఉప ఎన్నికల్లో పోటీచేసినట్టుగా కేటీఆర్, కవిత మాట్లాడటం వారి అవివేకం. నా రాజకీయ చరిత్ర ఏమిటో వాళ్ల నాయిన కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలి. కేసీఆర్ కంటే ముందుగానే ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. 1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు చంద్రబాబునాయుడు మంత్రి పదవిని ఇస్తే టీఆర్ఎస్ పుట్టేదా? ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో చంద్రబాబునాయుడుకు కేసీఆర్ తాబేదారుగా పనిచేశాడు. చంద్రబాబు మోచేతి నీళ్లుతాగుతూ, మంత్రి పదవిని అనుభవించినంతకాలం గుర్తుకురాని తెలంగాణ మంత్రిపదవి రాకపోయేసరికి కేసీఆర్‌కు గుర్తుకొచ్చింది. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్ కండువా వేసుకుని కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ గెలవలేదా? అధికారపార్టీలో ఉంటూనే తెలంగాణకోసం పోరాడి, జైలుకు పోయిన చరిత్రనాది. తెలంగాణకోసం ఏనాడైనా, ఒక్కరోజైనా కేటీఆర్, కవిత జైలుకు పోయారా? వాస్తవాలను దాచిపెట్టాలనుకుంటే చరిత్ర మారదు’ అని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పంలేదని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా ఎలా ప్రాజెక్టులను పూర్తిచేస్తారని ప్రశ్నించారు. శాసనసభలో తాను మాట్లాడని మాటలను ప్రస్తావించిన కేటీఆర్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇస్తానని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లు నిద్రపోయి, సింగరేణిలో ఎన్నికలు రాగానే, హడావిడిగా వారసత్వ ఉద్యోగాల కల్పన పేరుతో డ్రామాలకు టీఆర్ఎస్ తెరలేపిందని విమర్శించారు. కోర్టుతో ఇన్నిసార్లు మొట్టికాయలు తిన్న ప్రభుత్వం ఏదీ లేదని, అధికారంలో కొనసాగే అర్హత కూడా టీఆర్ఎస్కు లేదన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఒకటి, రెండు తప్ప ఏవీ అమలుచేయలేదన్నారు. కాంగ్రెస్‌లోకి హరీష్‌రావు వెళ్లడు అని స్వయంగా మంత్రి కేటీఆర్ అన్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని, బయటకు కనిపించిన రాజకీయ పరిణామాలేవో, అంతర్గతంగా జరుగుతుండొచ్చునని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్‌రావు, కాంగ్రెస్ అంటూ కేటీఆర్‌కు అనుమానం ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌పార్టీయే బాహుబలి అని, కాంగ్రెస్‌లో నాయకులు లేరని హరీష్‌రావును పిలుస్తామా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల అహంకార ధోరణి చూస్తుంటే వాళ్లకు ఘడియలు దగ్గరపడుతున్నట్టున్నాయని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అంబెడ్కర్ జయంతి నాడు నివాళులు అర్పించడానికి రాని దౌర్భాగ్యుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. లైసెన్సు లేకుండా మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన కుర్చీని కాపాడుకోవడానికి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. -
‘మత కోణంలో చూడడం కరెక్ట్ కాదు’
-
‘మత కోణంలో చూడడం కరెక్ట్ కాదు’
హైదరాబాద్: ముస్లింలకు నాలుగు శాతం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లను మత కోణంలో చూడడం సరికాదన్నారు. రిజర్వేషన్ల పెంపుదల బిల్లుపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన మట్లాడారు. విద్యా, ఉద్యోగాల్లో కాదు రాజకీయాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించిందని గుర్తు చేశారు. చట్టమైన ఇబ్బందులు ఎదురుకావడంతో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. ఇప్పటికీ ఇవే అమలు చేస్తున్నారని చెప్పారు. 40 పాలన తర్వాత 4 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత తమ పార్టీదేనని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీయిచ్చిందని, అధికారంలోకి వచ్చాక 9 నెలల దాకా కమిషన్ వేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని.. 4 నెలల్లోనే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పలేదన్నారు. రిజర్వేషన్ పెంపు బిల్లుకు మద్దతిస్తామని, అయితే బిల్లు ఏవిధంగా అమల్లోకి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో చేర్చకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రంతో బిల్లును ఆమోదింపజేసుకుంటామన్న విశ్వాసం తమకుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
'మెదక్ జిల్లాకు హరీశ్ అన్యాయం చేస్తున్నారు'
హైదరాబాద్ : మెదక్ జిల్లాకు హరీశ్‌రావు అన్యాయం చేస్తున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో టి.జీవన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా హరీశ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు కట్టాలనే చిత్తశుద్ధి ఉంటే రిజిస్ట్రేషన్ విలువ పెంచి నిర్వాసితులకు చెల్లింపులు జరపాలని ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలి'
హైదరాబాద్ : న్యాయాధికారుల సస్పెన్షన్ సమంజసం కాదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆప్షన్ అడిగినప్పుడే సీఎం కేసీఆర్ స్పందించి ఉండాల్సిందని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో టి. జీవన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు సద్దుమణిగిన విధంగా హైకోర్టు విభజన సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆయుత చండీయాగానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించిన సంగతి ఈ సందర్భంగా టి.జీవన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే హైకోర్టు విభజనపై చంద్రబాబుతో ఎందుకు మాట్లాడలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. హైకోర్టు విభజన జరిగేంత వరకు న్యాయాధికారుల విభజన ఆపాలని కేంద్రప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలన్నారు. కేసీఆర్ భేషజాలకు పోకుండా ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడకుండా హైకోర్టు విభజన సమస్య పరిష్కారం కోసం చంద్రబాబుతోనూ కేంద్రంతోనూ చర్చించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజేసే విధంగా ఇద్దరు సీఎంలు వ్యవహరించడం సరికాదని టి.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డంకి’
జగిత్యాల(కరీంనగర్): హైకోర్టు విభజనకు ఆంధ్రా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలేదీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు చేస్తే, అందుకు సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం సైతం హైకోర్టు విభజనకు మార్గం సుగమం చేసినప్పటి కీ చంద్రబాబు లాబీయింగ్ వల్లనే వెనుకడుగు వేస్తున్నట్లు ఆరోపించారు. -
'కేసీఆర్‌తోనే తెలంగాణకు దరిద్రం పట్టుకుంది'
హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణకు దరిద్రం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ...ఉత్తర తెలంగాణలో ఏనాడు దరిద్రం లేదన్నారు. కాళేళ్వరం ప్రాజెక్ట్ ఎన్ని మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారో చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ్మడిహట్టి వద్ద 155 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మిస్తేనే తెలంగాణకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అలాకాకుండా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మిస్తే తెలంగాణకు ప్రయోజనం ఉందన్నారు. మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. -
'231 కరవు మండలాలను మాత్రమే గుర్తించింది'
హైదరాబాద్ : గతేడాది సెప్టెంబర్‌లోపే రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించి ఉంటే బావుండేదని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 433 కరువు మండలాలు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 231 కరవు మండలాలను మాత్రమే గుర్తించిందని ఆయన చెప్పారు. సరైన సమయంలో కరువు మండలాలను గుర్తిస్తే కేంద్రం సాయం పొందే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి టి.జీవన్‌రెడ్డి సూచించారు. -
'మాటిమాటికి అబద్ధాలాడుతున్నారు'
హైదరాబాద్: మాటిమాటికి అబద్ధాలాడితే అది ప్రివిలేజ్ కిందకు వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో మాట్లాడుతూ.. కరువు మండలాల గుర్తింపులో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లాలో రామ్ ప్రాజెక్టు ఉందని, ఆ కారణం చేత కరువు మండలం జాబితాలో ప్రకటించలేదని చెప్పారు. కానీ రామ్ ప్రాజెక్టులో చుక్క నీరు కూడా లేదని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కలెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా పట్టించుకోలేదని, కరువు మండలాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'తెలంగాణ... సామంతరాజులా వ్యవహరించింది'
హైదరాబాద్ : గోదావరి నదిపై తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి స్పందించారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్ట్ ఎత్తు152 మీటర్ల అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి లాభం కలిగి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గడం వల్ల రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు మాత్రమే మేలు జరుగుతుందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం చక్రవర్తిలా వ్యవహరిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం సామంతరాజులా వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ను వారు డిమాండ్ చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి రంగారెడ్డి జిల్లాను తొలగించి... మెదక్ వరకే పరిమితం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ వల్ల కూడా రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి న్యాయం జరగిందన్నారు. ప్రాణిహిత - చేవెళ్ల పాత డిజైన్ ప్రకారం చేపడితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి చెప్పారు. -
తెలంగాణ ప్రయోజనాలకు తాకట్టుపెట్టారు
హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం వల్ల తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ ఎత్తును 152 నుంచి 148 మీటర్లకు తగ్గించారని జీవన్‌రెడ్డి విమర్శించారు. అలాగే మేడిగడ్డ వద్ద 103 నుంచి 101 మీటర్లకు తగ్గించారన్నారు. రూ. 40 వేల కోట్ల అదనపు భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు అయినా మిడ్‌మానేరు పూర్తి చేయకుండా పునరావాస ప్యాకేజీ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ అని జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. -
ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్టు ఉన్నారు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుల వ్యవహారం దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఉందని ఆయన శనివారమిక్కడ ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమయ్యాయో రెండు ప్రభుత్వాలు ప్రజలకు సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు కేసుల్లో ఇద్దరు సీఎంలు పరస్పరం ఆరోపించుకుని ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్లు ఉన్నారని, వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకే ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్లు ఉందని జీవన్ రెడ్డి అన్నారు. ఇద్దరు దోషులతో మోదీ చేయి కలపడం సరికాదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్, చంద్రబాబుపై... కేంద్రం విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ...
హైదరాబాద్: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితులు, ప్రభుత్వం అలసత్వం కారణంగా రైతులు చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణమాఫీని ఏకమొత్తంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... * తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కష్టాలు తొలగిపోతాయనే భావన ప్రజల్లో వచ్చింది * ముఖ్యంగా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు * రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు * వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి * ఏ రకంగా చూసినా రైతులకు ఇబ్బందులు తప్పలేదు * రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీయిచ్చింది * ఏక మొత్తంగా రుణమాఫీ అమలు చేస్తుందని రైతులు అనుకున్నారు * విడతలవారీగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది * ఇంతవరకు వ్యవసాయ రుణాలను జాతీయ స్థాయిలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణమని విడదీయలేదు * ఎన్నికల్లో ప్రకటించిన విధంగా రుణమాఫీ అమలు చేస్తే రైతులకు బాధలు తప్పేవి * 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంతవరకు కొనసాగిన ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించింది * ఉచిత్ విద్యుత్ ఇచ్చింది, విద్యుత్ చౌర్యాన్ని నిలువరించింది * ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువగా తెలంగాణ రైతులు లాభపడ్డారు * ఎవరూ ఊహించని విధంగా గ్రామగ్రామన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది * ఆత్మహత్యలు చేసున్న రైతాంగానికి బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో జీవో 421 జారీ చేసింది * ఒకవైపు నివారణ చర్యలు, మరోవైపు సహాయక చర్యలు చేపట్టింది * కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు సరిపోదని ప్రతి క్వింటాలకు రూ. 50 బోనస్ గా ఇచ్చింది * గత ప్రభుత్వ విధానాలను పరిగణనలోకి తీసుకుని రైతు ఆదుకునేందుకు ప్రయత్నించాలి * గత ప్రభుత్వాలపై నెపం నెట్టడం కాదు, అంతకంటే మెరుగైన రీతిలో చర్యలు చేపట్టిండి * రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. ప్రజలు ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు. * రుణమాఫీ నామమాత్రంగా జరుగుతోంది * రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి * ప్రభుత్వం గొప్పలకు పోయి రైతు సమస్యలను జటిలం చేస్తోంది * ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్నదాతల సమస్యలను పరిష్కరించాలి -
'మద్యనిషేధం అసాధ్యమనడం అసమర్థతకు నిదర్శనం'
జగిత్యాల(కరీంనగర్): రాష్ట్రంలో మద్యనిషేధం అసాధ్యమనడం టీఆర్ఎస్ సర్కారు అసమర్థతకు నిదర్శనమని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాల మంలం తిప్పన్నపేట, పెర్కపల్లి గ్రామాల్లో విలేకరులతో మాట్లాడారు. గతంలో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఎన్నికల కమిషన్ ఆదేశించిన 24 గంటల్లోపే రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులు, గుడుంబా తయారీ, విక్రయ కేంద్రాలను ఎక్సైజ్, పోలీసు శాఖ సహకారంతో బంద్ చేశారన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన యంత్రాంగం ఉన్నప్పటికీ మద్యాన్ని బంద్ చేయలేమనడం నిర్లక్ష్యమా, అసమర్థతా అని ప్రశ్నించారు. గుడుంబాను నియంత్రించే సాకుతో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెడితే పేదల ప్రాణాలకే ప్రమాదమన్నారు. -
అప్పుడు పాపాలు గుర్తుకు రాలేదా ?
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత విమర్శలను కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఖండించారు. ఎన్డీఏకి దగ్గర కావాలనే ప్రయత్నంలో భాగంగానే ఎంపీ కవిత... రాహుల్‌ను విమర్శిస్తున్నారని శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. పాపాలు కడుకొనేందుకు రాహుల్ పుష్కర స్నానాలు చేయాలనడం కవిత అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పినప్పుడు పాపాలు గుర్తుకు రాలేదా అంటూ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో వెయ్యి మంది రైతుల ఆత్మహత్యల పాపం అధికార టీఆర్ఎస్దే అని స్పష్టం చేశారు. సదరు రైతు కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్...అందులో రైతుల వాటా ఎంతో చెప్పాలని జీవన్‌రెడ్డి అన్నారు. -
'తప్పులు కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ఏసీబీ విచారణపై ఆ పార్టీ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఎందుకు విచారించడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఎవరు వారధిగా వ్యవహరిస్తున్నారని జీవన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో పెద్దవారిని వదిలేసి చిన్నవారిని ఎందుకు విచారిస్తున్నారంటూ జీవన్ రెడ్డి... ఏసీబీని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకోనే అని ఆయన స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఏసీబీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదనే భావన ప్రజల్లో కనబడుతుందని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
'ఫాంహౌస్ లో పంట సాగుపైనే కేసీఆర్ దృష్టి'
హైదరాబాద్: రాష్ట్రంలో రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేసి... సొంత ఫాంహౌస్‌లో పంటల సాగుపైనే సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతులు, వారి సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై శనివారం హైదరాబాద్‌లో జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు కావాల్సిన పెట్టుబడులు, ఎరువుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఏడాది రుణమాఫీని ఒకే విడతలో చెల్లించి... రైతులకు కొత్త రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్.. రైతులకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఉద్యానవన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని సభలో ప్రకటిచిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం... వాటిని ఇంకా చెల్లించకపోవడం ఓ విధంగా సభా హక్కుల ఉల్లంఘనే అని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజాం షుగర్స్‌కు వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి: జీవన్ రెడ్డి
హైదరాబాద్: నూతన ప్రారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రానికి రాబోయే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లలో మాట్లాడారు. పెద్ద పరిశ్రమల్లో స్థానిక రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని జీవన్‌రెడ్డి... కేసీఆర్ సర్కార్‌కు సూచించారు. -
'కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారు'
హైదరాబాద్: రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను విస్మరించి సీఎం కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కరువు, అకాల వర్షాలకు తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పంట నష్టం జరిగిన పండ్ల తోటలకు ఎకరాకు రూ. 50 వేలు, ఇతర పంటకు ఎకరాకు రూ. 20 వేలు చెల్లించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు మండలాలను తక్షణమే ప్రకటించాలని కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
'కేసీఆర్ మనవడి తరంలో కూడా అమలు కాదు'
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలుకు హామీలు ఇచ్చి... ఆపై ఎన్నికల్లో విజయం సాధించి సీఎం పీఠం అధిష్టించిన కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని కేసీఆర్ సర్కార్ విస్మరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇలా మొక్కుబడిగా ఈ పథకాన్ని అమలు చేస్తే... కేసీఆర్ కాదు గదా ఆయన మనువడి తరంలో కూడా కేజీ టూ పీజీ హామీ అమలు కాదని ఎద్దేవా చేశారు. విద్య హక్కు చట్టాన్ని కూడా కేసీఆర్ నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యం కాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. -
కేసీఆర్ పర్యటన అంతా ఒట్టి షో
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో తనదైన శైలిలో వ్యంగ బాణాలు సంధించారు. సీఎం కేసీఆర్‌ను చూసి సమస్యలు పారిపోవడం లేదని, వాటిని చూసీ కేసీఆరే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలు తదితర సమస్యలపై కేసీఆర్‌కు అవగాహన లేదని ఆరోపించారు. సీఎం పాలనపై ఉద్యమం సమయంలో ఆయనతో ఉద్యమించిన వారే ఇప్పుడు కేసీఆర్‌ను నిలదీస్తున్నారని తెలిపారు. వరంగల్‌లో కేసీఆర్ పర్యటన అంతా ఒట్టి నాటకమని అన్నారు. కేసీఆర్ ఆలోచనలు అన్నీ గాలిలో వేలాడుతున్నాయని... అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపిస్తున్నారని టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. -
'టీడీపీ... తెలంగాణ వ్యతిరేక పార్టీ'
హైదరాబాద్: టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ బస్సు యాత్ర ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ జీవన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అన్న చంద్రబాబు....ప్రస్తుతం విద్యుత్ కష్టాల్లో ఉన్న తెలంగాణకు ఏపీ నుంచి కరెంట్ సరఫరా చేసి ఆదుకోవాలని సూచించారు. అందుకోసం చంద్రబాబును ఒప్పించాలని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డుల ఏరివేతను నిలిపివేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల ఏరివేత పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ కొత్త ఆహార భద్రతా కార్డుల పేరుతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికే బోగస్ కార్డుల పేరుతో పది లక్షల రేషన్ కార్డులను ఏరివేసిన టీఆర్ఎస్ సర్కార్ మళ్లీ రేషన్ కార్డులను తొలగించాలంటున్నది ఇది ఎంత వరకు సమంజసమని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ విధానాలతో పెన్షన్లకు కూడా కోత పడుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
'అందరు దొంగల్లా కనబడుతున్నారేమో'
హైదరాబాద్: తెలంగాణలో ఖరీఫ్ రుణప్రణాళికను వెంటనే అమలుచేయాలని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ అయ్యేలోగా రైతులు వడ్డీ వ్యాపారుల బారీనపడి నష్టపోయే ప్రమాదముందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టిలో టీఆర్ఎస్ నేతలు తప్పా, అందరూ దొంగల మాదిరిగానే కనబడుతున్నారేమోనని అన్నారు. రేషన్‌కార్డులు, ఫీజురీయింబర్స్‌మెంట్, హౌసింగ్ పథకాలను అవినీతి పేరుతో నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణ కేబినెట్ కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పేద బీసీలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తే మంచిదని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
'ఇంచు భూమి కోల్పోయిన కేసీఆరే బాధ్యుడు'
కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇంచు భూమి కోల్పోయిన అందుకు బాధ్యత సీఎం కేసీఆర్‌దే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ... పోలవరం ముంపు మండలాలను కాపాడటంలో కేసీఆర్ విఫలమైయ్యారని ఆరోపించారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి పోలవరం ప్రాజెక్టు నిర్మించడం సాధ్యం కాదని జీవన్ రెడ్డి వెల్లడించారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్‌లోని ఇరు సభలు ఆమోదించాయి. దాంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. ఈ నేపథ్యంలో ఆ ఆర్డినెన్స్ బిల్లును అడ్డుకోవడంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం అసక్తి కనబరచలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. -
'రచ్చబండను దుర్వినియోగం చేస్తున్న సీఎం'
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దుర్వినియోగపరుస్తున్నారని టి. కాంగ్రెస్ నేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... సీఎం కిరణ్ కు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన తర్వాత రాజీకీయాలు చేయాలని సీఎం కిరణ్‌కు జీవన్‌రెడ్డి హితవు పలికారు.ప్రజా సమస్యల పరిష్కరానికి ఏర్పాటు చేసిన రచ్చబండను రాజకీయ వేదికగా చేసుకోవడం ఎంతవరకు సబబు అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
వాణిజ్యపరంగానే హైదరాబాద్ అభివృద్ధి: టి.జీవన్‌రెడ్డి
జగిత్యాల(కరీంనగర్), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో 60 ఏళ్లలో సీమాంధ్ర పాలకుల వల్ల హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి జిల్లా వాణిజ్యపరంగా మాత్రమే అభివృద్ధి చెందిందని, ఆ రెండు ప్రాంతాల్లోని ప్రజలు అభివృద్ధి చెందలేదని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిప్పన్నపేట గ్రామ సమీపంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీమాంధ్రలో ప్రతి జిల్లాకు జిల్లా కార్యాలయాలుంటే రంగారెడ్డి జిల్లాలో మాత్రం జిల్లా కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోందని తెలిపారు. అక్కడున్న జిల్లా కార్యాలయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు జాతీయస్థాయి ఐటీఐకి అప్పగించి రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను మాత్రం వాణిజ్య వ్యాపారవేత్తలకు అప్పజెప్పిన ఘనుడని విమర్శించారు. సీమాంధ్ర నాయకులే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు కొనుగోలు చేసి అభివృద్ధి చెందారే తప్ప తెలంగాణ ప్రజలను మాత్రం అభివృద్ధి చెందనివ్వలేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వల్లే దేశంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు అభివృద్ధి చెందారని, ప్రస్తుతం సోనియాగాంధీ తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రజల కోసం మాటతప్పని నాయకురాలిగా చరిత్రలో నిలబడతారని పేర్కొన్నారు. -
రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలి: జీవన్‌రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కిరణ్ సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కిరణ్.. ఎమ్మెల్యేల ద్వారా సీఎంగా ఎంపికైన నేత కాదని అన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించేలా ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రకియపై ముందుకెళ్లాలని సీఎం కిరణ్ నిన్న అన్నారు. రాష్ట్ర విభజన అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీదేనని కేంద్రానికి కాదని స్పష్టం చేశారు.