
'అందరు దొంగల్లా కనబడుతున్నారేమో'
హైదరాబాద్: తెలంగాణలో ఖరీఫ్ రుణప్రణాళికను వెంటనే అమలుచేయాలని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ అయ్యేలోగా రైతులు వడ్డీ వ్యాపారుల బారీనపడి నష్టపోయే ప్రమాదముందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టిలో టీఆర్‌ఎస్ నేతలు తప్పా, అందరూ దొంగల మాదిరిగానే కనబడుతున్నారేమోనని అన్నారు.
రేషన్‌కార్డులు, ఫీజురీయింబర్స్‌మెంట్, హౌసింగ్ పథకాలను అవినీతి పేరుతో నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణ కేబినెట్ కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పేద బీసీలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తే మంచిదని జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు.