
'మాటిమాటికి అబద్ధాలాడుతున్నారు'
హైదరాబాద్: మాటిమాటికి అబద్ధాలాడితే అది ప్రివిలేజ్ కిందకు వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో మాట్లాడుతూ.. కరువు మండలాల గుర్తింపులో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లాలో రామ్ ప్రాజెక్టు ఉందని, ఆ కారణం చేత కరువు మండలం జాబితాలో ప్రకటించలేదని చెప్పారు. కానీ రామ్ ప్రాజెక్టులో చుక్క నీరు కూడా లేదని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కలెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా పట్టించుకోలేదని, కరువు మండలాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.