'కేసీఆర్ మనవడి తరంలో కూడా అమలు కాదు'
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలుకు హామీలు ఇచ్చి... ఆపై ఎన్నికల్లో విజయం సాధించి సీఎం పీఠం అధిష్టించిన కేసీఆర్పై టీ కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని కేసీఆర్ సర్కార్ విస్మరిస్తుందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ఇలా మొక్కుబడిగా ఈ పథకాన్ని అమలు చేస్తే... కేసీఆర్ కాదు గదా ఆయన మనువడి తరంలో కూడా కేజీ టూ పీజీ హామీ అమలు కాదని ఎద్దేవా చేశారు. విద్య హక్కు చట్టాన్ని కూడా కేసీఆర్ నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యం కాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.