సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున పంజాబ్, మహారాష్ట్ర తరహాలో విద్యార్థుల అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడింగులివ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, ఇతర జాతీయ స్థాయి కోర్సుల్లో చేరే విషయంలో ఆందోళనలో ఉన్నారని ఆ లేఖలో తెలిపారు. వెంటనే నిర్ణయం తీసుకుని పదో తరగతి ఫలితాలు ప్రకటించడం ద్వారా తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలు పోగొట్టాలని జీవన్‌రెడ్డి కోరారు.
అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వండి
Published Mon, Jun 8 2020 3:51 AM | Last Updated on Mon, Jun 8 2020 3:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment