
కేసీఆర్ పర్యటన అంతా ఒట్టి షో
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో తనదైన శైలిలో వ్యంగ బాణాలు సంధించారు. సీఎం కేసీఆర్ను చూసి సమస్యలు పారిపోవడం లేదని, వాటిని చూసీ కేసీఆరే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలు తదితర సమస్యలపై కేసీఆర్కు అవగాహన లేదని ఆరోపించారు.
సీఎం పాలనపై ఉద్యమం సమయంలో ఆయనతో ఉద్యమించిన వారే ఇప్పుడు కేసీఆర్ను నిలదీస్తున్నారని తెలిపారు. వరంగల్లో కేసీఆర్ పర్యటన అంతా ఒట్టి నాటకమని అన్నారు. కేసీఆర్ ఆలోచనలు అన్నీ గాలిలో వేలాడుతున్నాయని... అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపిస్తున్నారని టి.జీవన్రెడ్డి విమర్శించారు.