‘హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డంకి’ | T jeevan reddy slams chandrababu naidu prevent to division of Highcourt | Sakshi
Sakshi News home page

‘హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డంకి’

Published Thu, Jun 9 2016 7:49 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

T jeevan reddy slams chandrababu naidu prevent to division of Highcourt

జగిత్యాల(కరీంనగర్): హైకోర్టు విభజనకు ఆంధ్రా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలేదీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు చేస్తే, అందుకు సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం సైతం హైకోర్టు విభజనకు మార్గం సుగమం చేసినప్పటి కీ చంద్రబాబు లాబీయింగ్ వల్లనే వెనుకడుగు వేస్తున్నట్లు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement