సాక్షి, అమరావతి : హైకోర్టు స్టే, సాక్షి కథనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. బసవతారకం బేబీ కిట్ల పంపిణీలో అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లను రద్దు చేసింది. దీంతో తొలిరోజే బేబీ కిట్ల పంపిణీ నిలిచిపోయింది. కాంట్రాక్టర్ల మధ్య రాజీ కుదిర్చి.. నిబంధనలకు విరుద్ధంగా కిట్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా అర్హతలేని సంస్థలకు బేబీ కిట్ల ఆర్డర్‌ను వైద్యశాఖ కట్టబెట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ లో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా బేబీ కిట్ల పంపిణీలో అవినీతి జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పు రాకముందే టెండర్లను రద్దు చేయడంతో... అవినీతి జరుగుతోందని పరోక్షంగా అంగీకరించినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment