'టీడీపీ... తెలంగాణ వ్యతిరేక పార్టీ' | T Jeevan reddy takes on TRS Government due to ration cards | Sakshi
Sakshi News home page

'టీడీపీ... తెలంగాణ వ్యతిరేక పార్టీ'

Published Fri, Oct 10 2014 1:06 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM

'టీడీపీ... తెలంగాణ వ్యతిరేక పార్టీ' - Sakshi

'టీడీపీ... తెలంగాణ వ్యతిరేక పార్టీ'

హైదరాబాద్: టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ బస్సు యాత్ర ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ జీవన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అన్న చంద్రబాబు....ప్రస్తుతం విద్యుత్ కష్టాల్లో ఉన్న తెలంగాణకు ఏపీ నుంచి కరెంట్ సరఫరా చేసి ఆదుకోవాలని సూచించారు. అందుకోసం చంద్రబాబును ఒప్పించాలని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డుల ఏరివేతను నిలిపివేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.

రేషన్ కార్డుల ఏరివేత పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ కొత్త ఆహార భద్రతా కార్డుల పేరుతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.  ఇప్పటికే బోగస్ కార్డుల పేరుతో పది లక్షల రేషన్ కార్డులను ఏరివేసిన టీఆర్ఎస్ సర్కార్ మళ్లీ రేషన్ కార్డులను తొలగించాలంటున్నది ఇది ఎంత వరకు సమంజసమని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ విధానాలతో పెన్షన్లకు కూడా కోత పడుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement