తెలంగాణ ప్రయోజనాలకు తాకట్టుపెట్టారు
హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం వల్ల తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో జీవన్రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ ఎత్తును 152 నుంచి 148 మీటర్లకు తగ్గించారని జీవన్రెడ్డి విమర్శించారు.
అలాగే మేడిగడ్డ వద్ద 103 నుంచి 101 మీటర్లకు తగ్గించారన్నారు. రూ. 40 వేల కోట్ల అదనపు భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు అయినా మిడ్మానేరు పూర్తి చేయకుండా పునరావాస ప్యాకేజీ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ అని జీవన్రెడ్డి నిప్పులు చెరిగారు.