హైదరాబాద్: నూతన ప్రారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రానికి రాబోయే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్లలో మాట్లాడారు. పెద్ద పరిశ్రమల్లో స్థానిక రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని జీవన్రెడ్డి... కేసీఆర్ సర్కార్కు సూచించారు.