ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్టు ఉన్నారు | T jeevan reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్టు ఉన్నారు

Published Sat, Oct 24 2015 12:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్టు ఉన్నారు - Sakshi

ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్టు ఉన్నారు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ జీవన్రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుల వ్యవహారం దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఉందని ఆయన శనివారమిక్కడ ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమయ్యాయో రెండు ప్రభుత్వాలు ప్రజలకు సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

రెండు కేసుల్లో ఇద్దరు సీఎంలు పరస్పరం ఆరోపించుకుని ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్లు ఉన్నారని, వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకే ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్లు ఉందని జీవన్ రెడ్డి అన్నారు. ఇద్దరు దోషులతో మోదీ చేయి కలపడం సరికాదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్, చంద్రబాబుపై... కేంద్రం విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement