హైదరాబాద్ : సీఎం కేసీఆర్తోనే తెలంగాణకు దరిద్రం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లో జీవన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ...ఉత్తర తెలంగాణలో ఏనాడు దరిద్రం లేదన్నారు. కాళేళ్వరం ప్రాజెక్ట్ ఎన్ని మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారో చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.
తమ్మడిహట్టి వద్ద 155 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మిస్తేనే తెలంగాణకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అలాకాకుండా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మిస్తే తెలంగాణకు ప్రయోజనం ఉందన్నారు. మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.