రాష్ట్రంలో మద్యనిషేధం అసాధ్యమనడం టీఆర్‌ఎస్ సర్కారు అసమర్థతకు నిదర్శనమని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు.
జగిత్యాల(కరీంనగర్): రాష్ట్రంలో మద్యనిషేధం అసాధ్యమనడం టీఆర్‌ఎస్ సర్కారు అసమర్థతకు నిదర్శనమని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాల మంలం తిప్పన్నపేట, పెర్కపల్లి గ్రామాల్లో విలేకరులతో మాట్లాడారు.
గతంలో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఎన్నికల కమిషన్ ఆదేశించిన 24 గంటల్లోపే రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులు, గుడుంబా తయారీ, విక్రయ కేంద్రాలను ఎక్సైజ్, పోలీసు శాఖ సహకారంతో బంద్ చేశారన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన యంత్రాంగం ఉన్నప్పటికీ మద్యాన్ని బంద్ చేయలేమనడం నిర్లక్ష్యమా, అసమర్థతా అని ప్రశ్నించారు. గుడుంబాను నియంత్రించే సాకుతో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెడితే పేదల ప్రాణాలకే ప్రమాదమన్నారు.