రూ.20 కోట్ల నగదు, రూ.14 కోట్ల లిక్కర్ సీజ్
లక్నో: అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఏడు దశల ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ శనివారం ముగిసింది. నేడు జరిగిన తొలిదశ పోలింగ్లో 63 శాతం మంది ప్రజలు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ 73 నియోజకవర్గాలు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఈ తొలి దశ పోలింగ్ నేపథ్యంలో పట్టుబడ్డ నగదు, బంగారం, డ్రగ్ వివరాలను కూడా ఎన్నికల సంఘం మీడియాకు విడుదల చేసింది.
మొత్తం రూ.19.56 కోట్ల నగదు, రూ.96.93 లక్షల విలువైన డ్రగ్, రూ.4.44 లక్షల లీటర్ల లిక్కర్, రూ.14 కోట్ల బంగారం, వెండిని సీజ్ చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అదేవిధంగా 13 పెయింట్ న్యూస్ కేసులను గుర్తించినట్టు పేర్కొంది. ఈ ఎన్నికల నేపథ్యంలో 3,888 డిజిటల్, వీడియో కెమెరాలను ఎన్నికల సంఘం ఏర్పాటుచేసింది. 2,8577 ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ను చేపట్టింది.