'రచ్చబండను దుర్వినియోగం చేస్తున్న సీఎం'
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దుర్వినియోగపరుస్తున్నారని టి. కాంగ్రెస్ నేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం జీవన్రెడ్డి హైదరాబాద్లో మాట్లాడుతూ... సీఎం కిరణ్ కు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజీనామా చేసిన తర్వాత రాజీకీయాలు చేయాలని సీఎం కిరణ్కు జీవన్రెడ్డి హితవు పలికారు.ప్రజా సమస్యల పరిష్కరానికి ఏర్పాటు చేసిన రచ్చబండను రాజకీయ వేదికగా చేసుకోవడం ఎంతవరకు సబబు అని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు.