తెలంగాణ జిల్లాల్లో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాల్లో సీఎం ఫోటోల దూమారం చెలరేగుతూనే ఉంది.
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాల్లో సీఎం ఫోటోల దూమారం చెలరేగుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లా వర్నిలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సీఎం బొమ్మతో రచ్చబండ జరపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనగా, ఎంపీ సురేష్‌షెట్కార్ సీఎం ఫ్లెక్సీని చింపివేశారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో అధికారులు వేదికపై సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా, టీఆర్‌ఎస్ నేతలు చెప్పులతో కొట్టి దహనం చేశారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో, పాలమూరు జిల్లాలో సీఎం ఫొటో వివాదాస్పదమయ్యాయి. కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లో సీఎం ఫొటోలను ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్యెల్యే గంగుల కమలాకర్ తొలగించి దహనం చేశారు.