ఆలంపల్లి/ తాండూరు రూరల్ , న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండను వేదికగా చేసుకుని సమైక్యరాగం వినిపిస్తున్నారని, దశాబ్దాల కల నెరవేరే సమయంలో కుట్రలు పన్ని తెలంగాణ రాష్ట్ర బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ విమర్శించారు. సోమవారం ఆయన వికారాబాద్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సమన్యాయం అంటున్నారే తప్ప.. అది ఎలా సాధ్యమో చెప్పడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్‌ను కేంద్రంగా ప్రకటించాలన్నారు. అనంతగిరి హిల్స్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంజినీర్‌స జేఏసీ నాయకులు సంపత్, శ్రీనివాస్, నర్సింలు పాల్గొన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో మూడు డిమాండ్లు..
తెలంగాణ పున ర్నిర్మాణంలో భాగంగా తమ నుంచి మూడు ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయని విఠల్ అన్నారు. మొదటిది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 90రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఒకే నోటిఫికేషన్‌లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని, రెండోది సాయుధ పోరాట యోధుల మాదిరిగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలన్నారు. మూడో డిమాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థులు, ఉద్యోగులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని విఠల్ డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రచ్చబండ వేదికపై సమైక్య రాగమా?: విఠల్
Published Tue, Nov 26 2013 5:05 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement