Vithal
-
టీఆర్ఎస్ చేరే ప్రసక్తే లేదు అవన్నీ పుకార్లు.. బీజేపీతోనే ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తాము టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. తాము బీజేపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని రవీందర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కొక్కరిని టీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారని, ఉద్యమ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్కు నైతిక విలువలు లేవని గ్రహించే తాము ఆ పార్టీని వీడి బీజేపీలో చేరామన్నారు. మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళతామనుకోవడం అవివేకమన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ను ఓడిస్తామని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నన్ను ఎవరూ కొనలేరు: విఠల్ తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని.. తనను ఎవరూ కొనుగోలు చేయలేరని టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ స్పష్టంచేశారు. చివరిశ్వాస వరకూ బీజేపీలోనే ఉంటానన్నారు. తాను నైతిక రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నానని, ఆ విలువల ప్రాతిపదికనే బీజేపీలో చేరానని పేర్కొన్నారు. -
తెలంగాణకు అన్యాయంపై ఎలుగెత్తిన వాణి
ఆయన పేరు బారు పాండురంగ విఠల్. ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ రామనర్సు పుత్రుడు. ప్రముఖ రచయిత సివిల్ సర్వెంట్ సంజయ్ బారు తండ్రి. తన 93 ఏట తుది శ్వాస విడిచేదాకా దేశం జాతి ప్రజ అని ఆలోచించిన బారు పాండురంగ విఠల్ ఈ దేశ ఆర్థిక రంగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రం మరిచిపోలేని మహనీయుడు. దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక కార్యదర్శి (1972–82). ఒక ముఖ్యమయిన రాజ్యాంగ సంస్థగా ఆర్థిక సంఘం గుర్తింపు పొంది పనిచేసే రోజుల్లో ఆయన పదో ఆర్థిక సంఘం సభ్యుడు (1992–94). తను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, పదవ ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఉన్నపుడు సభ్యుడిగా విశేష సేవలందించిన విఠల్‌ను ది మెమోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కాసుబ్రహ్మానందరెడ్డి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగం పూర్వాపరాలు, లోపాలు లాభాలు, తెలంగాణకు జరిగిన అన్యాయాలు అన్నీ కంఠతా తెలిసిన వ్యక్తి, వివేకవంతమైన పరిష్కారాలు చూపగల మేధావి. ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బిపిఆర్ విఠల్’ అని ఆయన శిష్యులు ప్రచురించిన 550 పేజీల ఉద్గ్రం«థం ఆయన వ్యక్తిత్వానికి సమగ్రమైన దర్పణం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వై వేణుగోపాల్ రెడ్డి ఆర్థిక వేత్త విఠల్‌ను గురువుగా గౌరవించేవారు. ఆర్థికరంగం, తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం, భౌతికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం, రాజకీయశాస్త్రం వంటి అనేక రంగాలలో సమగ్రమైన అవగాహన, ఆలోచనలు ఉన్న మేధావి విఠల్ అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. ఒక గురువు, శ్రేయోభిలాషి, తనను అభిమానించే ఒక ఉత్తముడిని కోల్పోయానని బాధపడ్డారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అనే సంస్థకు రూపకల్పన చేసి, నెలకొల్పి, నిలబెట్టిన దార్శనికుడు విఠల్. బోధన పరిశోధన కలిసి సాగాలనే ఉద్దేశ్యంతో విఠల్ ఈ సంస్థను తీర్చిదిద్దారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆయనకు నివాళులర్పించారు. గాంధీ ప్రభావంతో విద్యార్థిగా తన కళాశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర వీరుడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడే అయినా తెలంగాణలో స్థిరపడి, హైదరాబాద్‌లో ఉర్దూ మీడియం బడిలో చదువుకున్నాడు. నిజాం కాలేజి విద్యార్థి. 1949లో సివిల్ సర్వీసులో చేరి 1950లో ఐఏఎస్ అధికారి అయినారు. బారు పాండురంగ విఠల్ తండ్రి ప్రొఫెసర్ రామనర్సు వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ తరువాత రామనర్సు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆకాలంలో రావాడ సత్యనారాయణ వైస్ చాన్సలర్‌గా ఉన్నారు. వీరు ఇరువురు తెలంగాణ అస్తిత్వ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఆంధ్ర మేధావులు. వారి చిత్తశుద్ధి, జనసంక్షేమపరమైన ఆలోచనలు సాటిలేనివి. తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపొందించడం సరైన ప్రయోగం కాదని, అందువల్ల తెలం గాణ చాలా నష్టపోతుందని ఆనాటి రోజుల్లోనే వ్యతిరేకించిన ఆర్థిక శాస్త్రవేత్త విఠల్. వందల కోట్ల రూపాయల మిగులు ధనం ఉండిన సంపన్నరాష్ట్రం తెలంగాణ. అప్పట్లో పన్నుల ఆదాయం కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుతో ఈ విలీనం సరైన చర్య కాదని ఆయన వివరించేవారు. అంతే కాదు 1969లో తెలంగాణా ఉద్యమం ప్రారంభమైనప్పుడు తెలంగాణకు ఏవిధమైన అన్యాయాలు ఎదురైనాయో రుజువులతో సహా అంకెలన్నీ జనం ముందుంచిన చిత్తశుద్ధి కలిగిన అధికారి. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం అయిదు సూత్రాల పథకాన్ని రూపకల్పన చేసింది బీపీఆర్ విఠల్ గారే. అయితే పెద్దమనుషుల ఒప్పందం లాగే దీన్ని కూడా పాలకులు చెత్తబట్టలో వేశారు. ఆ తరువాత ఆయనే ఆరుసూత్రాల పథకం కూడా కల్పించారు. దానికి కూడా గండి కొట్టారు. 1984లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినపుడు కూడా తెలంగాణకు న్యాయం చేయడానికి ఎన్టీ రామారావును ఒప్పించి 610 జీవో తెచ్చిన ఉత్తముడు, చేతులెత్తి మొక్కాల్సిన వ్యక్తి విఠల్ అని ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి ప్రశంసించారు. అయితే చంద్రబాబునాయుడు పాలనలో తెలంగాణ వ్యతిరేక రాజకీయాలకు ఆ 610 జీవో కూడా బలైపోయింది. 1994లో తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలైంది. అప్పుడు తెలంగాణ మిగులు నిథులు ఎన్నో ఉండేవి. అవేమయ్యాయి? అని సవాలు చేస్తూ ఒక పుస్తకం రాశారు విఠల్. ఆంధ్ర మూలాలు ఉన్నప్పటికీ తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక అధికారిగా అనేక ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలం అయినప్పుడు తెలంగాణా వేర్పాటు ఉద్యమం సరైనదని భావించి ఉద్యమానికి మద్దతు నిచ్చిన ఉన్నతమైన వ్యక్తి బీపీఆర్ విఠల్. గుడ్డిగా ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ రాజకీయనాయకుల రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు తల ఊపడం కాకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయాలన్న తపన ఉన్న కొందరు సివిల్ సర్వీసు అధికారుల్లో బీపీఆర్ విఠల్ ముఖ్యులు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
అరుదైన అధికారి బీపీఆర్ విఠల్
93 ఏళ్ల వయసులో కన్నుమూసిన విఠల్ తొలితరం ఐఏఎస్ అధికారి. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో కీలక పద వులు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో 1972 నుంచి 1982 వరకూ ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా; ఏపీ ప్లానింగ్ అండ్ డెవ లప్మెంట్ బోర్డు వైస్ చైర్మన్‌గా; పదో ఆర్థిక సంఘం సభ్యుడిగా; కేరళ ప్రభుత్వం ఎక్స్ పెండీచర్ కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేశారు. ఐఎంఎఫ్ తరఫున సూడాన్, మాలావీ ప్రభుత్వా లకు ఆర్థిక సలహాదారుగానూ ఉన్నారు. విఠల్ పూర్వీకులది శ్రీకాకుళం జిల్లా. తరువాత రాజమండ్రిలో స్థిరపడ్డారు. విఠల్ తండ్రి నిజాం కాలంలో తెలంగాణ వచ్చారు. రాజ మండ్రిలో ఇప్పటికీ వారి ఇంటి పేరిట బారు వారి వీధి ఉంది. 1942లో నిజాం కాలేజీలో చదువును మధ్యలో వదిలేసి క్విట్ ఇండియా ఉద్యమంలో చేరారు. గాంధీజీ సలహా మేరకు తిరిగి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకు న్నారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆ కళాశాల విద్యార్థి సంఘం తొలి భారతీయ అధ్యక్షుడు ఆయనే. 1949లో హైదరాబాద్ సివిల్ సర్వీసులో చేరిన విఠల్, మరు సటి ఏడాది ఐఏఎస్‌కు అర్హత సాధించారు. 1950లో హైద రాబాద్ రాష్ట్రంలో మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్‌గా పీడిత వర్గాల అభ్యున్నతికి పనిచేశారు. కాసు బ్రహ్మా నందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి ప్రభు త్వాల హయాంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ మరియు దాని అప్పటి చైర్మన్ జె.చొక్కా రావుతో కలిసి క్రియాశీలంగా పనిచేశారు. 1960లో ఉస్మా నియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధితో సన్ని హిత సంబంధముంది. 1969లో తెలంగాణ ఆందోళన తర్వాత ఫైవ్ పాయింట్ ఫార్ములా పరిణామంతో, 1972లో జరిగిన ఆంధ్ర ఆందోళన తర్వాత సిక్స్ పాయింట్ ఫార్ము లాతో దగ్గరి సంబంధం కలిగి ఉన్న అధికారి విఠల్ ఒక్కరే. ఈ రెండు ఫార్ములాల సత్ఫలితాలతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. అక్షరాస్యత ఉద్యమంలో భాగంగా 1990లో దేశవ్యాప్తంగా భారత జ్ఞాన విజ్ఞాన సమితిని కేంద్రం ఏర్పాటు చేయగా– ఆంధ్రప్రదేశ్‌లో ఆ సమితికి విఠల్ అధ్యక్షులు గాను, నేను కార్యదర్శిగా, వావిలాల గోపాల కృష్ణయ్య ఉపాధ్య క్షులుగాను పనిచేశాము. ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించి ఆంధ్ర ప్రదేశ్‌లోని 9 మండలాల్లో అక్షరాస్యత కార్యక్ర మాన్ని నిర్వహించాలంది. సుమారు 4 ఏళ్ల పాటు కొనసాగిన ఈ ప్రాజెక్టు కింద మిగిలిన రూ.47 లక్షల నిధులను తిరిగి కేంద్రానికి అప్ప గించడంలో విఠల్ నిజాయితీని అవగతం చేసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత నిజామ్ ట్రస్ట్, హైదరాబాద్ లిటరరీ సొసైటీ, జన విజ్ఞాన వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సీఈఎస్ఎస్) సంస్థ స్థాపించారు. అనేక రచ నలు చేశారు. ఆయన పుస్తకం ‘ద తెలంగాణ సర్‌ప్లసెస్: ఎ కేస్ స్టడీ’ ప్రత్యేక తెలంగాణ డిమాండు బలపడేందుకు దోహ దపడింది. నిర్వహించిన ప్రతి పదవిలోనూ సామాన్యంగా బతకడం విఠల్ నైజంగా చెప్పవచ్చు. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ మొబైల్ : 99499 30670 -
విశ్రాంత ఐఏఎస్ విఠల్ కన్నుమూత
సాక్షి, జూబ్లీహిల్స్: ప్రముఖ ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ (94) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శేషు విఠల్, కుమారులు సంజయ్ బారు, చైతన్య, కుమార్తె నివేదిత ఉన్నా రు. పెద్ద కుమారుడు సంజయ్ బారు ప్రముఖ కాలమిస్ట్‌గా పనిచేయడంతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పని చేశారు. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సహా పలు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. శనివారం ఫిలిం నగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1950లో ఐఏఎస్‌కు ఎంపిక... హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసిన విఠల్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1950లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 1950 కేడర్‌కు చెందిన బీపీఆర్ విఠల్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో సేవలు అందించారు. 1972 నుంచి 1982 వరకు ఆయన ఏపీ ప్రణాళికా విభాగానికి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. పదవ ఆర్థిక సంఘం చైర్మన్‌గా సేవలు అందించారు. కేరళ ప్రభుత్వంలో ఎక్స్పెండిచర్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. విషాద వదనంలో బీపీఆర్ విఠల్ సతీమణి శేషు విఠల్, కుమార్తె నివేదిత ప్రణాళికా సంఘం సభ్యుడిగానే కాకుండా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్) సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. సూడాన్, మలావీ తదితర దేశాల ప్రభుత్వాలకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సర్వీసెస్ (సెస్) ఏర్పాటు చేయడంలో బీపీఆర్ విఠల్ ప్రధాన భూమిక పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళ్రావు, పీవీ నర్సింహారావు, మర్రి చెన్నారెడ్డి వద్ద ప్రభుత్వ కార్యదర్శిగా పని చేశారు. అప్పట్లో ఆయన ‘మెమరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల నుంచి మన్న నలు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి బీజం... ఆర్థిక రంగంపై బీపీఆర్ విఠల్ పలు పుస్తకాలు రచించారు. ఆయన రాసిన ‘ద తెలంగాణ సర్ప్లస్ఎస్: ఎ కేస్ స్టడీ’పుస్తకం తర్వాత కాలంలో తెలంగాణా ఉద్యమానికి బీజం వేసిందని చెబుతారు. రిటైర్మెంట్ అనంతరం నిజాం ట్రస్ట్, హైదరాబాద్ లిటరరీ సొసైటీ, జనవిజ్ఞాన వేదిక తదితర సంఘా లు, సంస్థలకు ఆయన సేవలు అందించారు. విఠల్ తండ్రి ప్రొఫెసర్ బీవీ రామనర్సు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, నిజాం కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రసి ద్ధ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్య క్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలంపాటు ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా విఠల్ సేవలందించారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఏపీ ప్రణాళిక, అభివృద్ధి మం డలి ఉపాధ్యక్షుడిగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుగా, 10వ ఆర్థిక సంఘం సభ్యుడిగా విఠల్ ఉత్తమ సేవలందించా రని కొనియాడారు. బీపీఆర్ విఠల్ మృతిపట్ల మంత్రి కె. తారక రామారావు తీవ్ర సంతాపం వ్య క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిలదొక్కుకుంటుందా లేదా? అనే అనుమానాలను పటాపంచలు చేసేందుకు ‘తెలంగాణ సర్ప్లస్ఎస్’పుస్తకాన్ని విఠల్ రాశారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన కుమారుడు, కుటుంబ సభ్యుల కు సానుభూతి తెలియజేశారు. విఠల్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ఐఏఎస్‌లు సంతాపం తెలిపారు. బీపీఆర్ విఠల్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ఉమ్మడి ఏపీ ఆర్థిక శాఖ మాజీ ప్రభుత్వ కార్యదర్శి, ఐఎంఎఫ్(ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్) సలహాదారు బీపీఆర్ విఠల్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
బీపీఆర్ విఠల్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ (93) మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. బీపీఆర్ విఠల్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అతి ఎక్కువ కాలం పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా, ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు వైస్ చైర్మన్‌గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుడిగా, పదవ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా విఠల్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. బీపీఆర్ విఠల్‌కు భార్య శేషు, కుమార్తె నివేదిత కుమార్, కుమారులు సంజయ్ బారు, చైతన్య బారు ఉన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంజయ్ బారు మీడియా సలహాదారుగా వ్యవహరించారు. -
వివాహితపై అత్యాచారయత్నం
రాయికోడ్, న్యూస్‌లైన్ : పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని ఇందూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత పొలం పనులు, కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం పొలం పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో గ్రామ శివారులో నివాసముంటున్న గ్రామానికి చెందిన చాకలి విఠల్ ఆమె ను అటకాయించాడు. చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో బాధితురాలు ప్రతిఘటించి కేకలు వేయడంతో విఠల్ పారిపోయాడు. ఈ క్రమంలో స్థానికులు గమనిం చి బాధితురాలిని ఇంటికి పంపించారు. జరిగిన విషయా న్ని భర్తతో వివరించి గురువారం పోలీసులను ఆశ్రయిం చింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రచ్చబండ వేదికపై సమైక్య రాగమా?: విఠల్
ఆలంపల్లి/ తాండూరు రూరల్ , న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండను వేదికగా చేసుకుని సమైక్యరాగం వినిపిస్తున్నారని, దశాబ్దాల కల నెరవేరే సమయంలో కుట్రలు పన్ని తెలంగాణ రాష్ట్ర బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ విమర్శించారు. సోమవారం ఆయన వికారాబాద్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సమన్యాయం అంటున్నారే తప్ప.. అది ఎలా సాధ్యమో చెప్పడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్‌ను కేంద్రంగా ప్రకటించాలన్నారు. అనంతగిరి హిల్స్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంజినీర్స జేఏసీ నాయకులు సంపత్, శ్రీనివాస్, నర్సింలు పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మూడు డిమాండ్లు.. తెలంగాణ పున ర్నిర్మాణంలో భాగంగా తమ నుంచి మూడు ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయని విఠల్ అన్నారు. మొదటిది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 90రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఒకే నోటిఫికేషన్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని, రెండోది సాయుధ పోరాట యోధుల మాదిరిగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలన్నారు. మూడో డిమాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థులు, ఉద్యోగులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని విఠల్ డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.