
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ (93) మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. బీపీఆర్ విఠల్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అతి ఎక్కువ కాలం పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా, ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డు వైస్ చైర్మన్‌గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుడిగా, పదవ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా విఠల్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. బీపీఆర్ విఠల్‌కు భార్య శేషు, కుమార్తె నివేదిత కుమార్, కుమారులు సంజయ్ బారు, చైతన్య బారు ఉన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంజయ్ బారు మీడియా సలహాదారుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment