రాయికోడ్, న్యూస్‌లైన్ : పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని ఇందూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత పొలం పనులు, కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం పొలం పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరింది.
ఈ క్రమంలో గ్రామ శివారులో నివాసముంటున్న గ్రామానికి చెందిన చాకలి విఠల్ ఆమె ను అటకాయించాడు. చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో బాధితురాలు ప్రతిఘటించి కేకలు వేయడంతో విఠల్ పారిపోయాడు. ఈ క్రమంలో స్థానికులు గమనిం చి బాధితురాలిని ఇంటికి పంపించారు. జరిగిన విషయా న్ని భర్తతో వివరించి గురువారం పోలీసులను ఆశ్రయిం చింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వివాహితపై అత్యాచారయత్నం
Published Thu, Jan 9 2014 11:58 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement