రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తయిందని, సీఎంగా మీతో గడపడం తన పూర్వజన్మ సుకృతమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
రాయచోటి రచ్చబండలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తయిందని, సీఎంగా మీతో గడపడం తన పూర్వజన్మ సుకృతమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌జిల్లా రాయచోటిలో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందలేదని లబ్ధిదారులు బాధపడకుండా ఉండేందుకే రచ్చబండ కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా రెండు విడతల్లో 60లక్షల మందికి ప్రభుత్వ పథకాలల్లో అవకాశం కల్పించామన్నారు.