కిరణ్కు 'రంగు' పడింది | Telangana supporter throws black paint at Kiran kumar reddy flexy | Sakshi
Sakshi News home page

కిరణ్కు 'రంగు' పడింది

Published Fri, Nov 22 2013 2:33 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్కు 'రంగు' పడింది - Sakshi

కిరణ్కు 'రంగు' పడింది

నిజామాబాద్ : ముఖ్యంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి 'రంగు' పడింది. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి, సిరికొండ మండల కేంద్రంలో  నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఫెక్సీ మీద సీఎం బొమ్మ ఉండటంపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు.   సభలో ఏర్పాటు చేసిన ఫెక్సీపై ఉన్న ముఖ్యమంత్రి బొమ్మకు నల్లరంగు వేశారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు  ఆ ఫెక్సీని తొలగించారు.

ఇక సిరికొండలో జరిగిన సభలో తెలంగాణవాదులు, సర్పంచులు నినాదాలు చేశారు. తెలంగాణ ద్రోహుల బొమ్మలు పెట్టడం ఏంటని అడ్డుకునేందుకు యత్నించారు.  మున్సిపల్ కార్పోరేషన్ ఆవరణ ఉన్న రచ్చబండ శకటాన్ని జేఏసీ నాయకులు చిన్నాభిన్నం చేశారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి నల్లరంగు చల్లిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement