రాష్ట్ర విభజనతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనకు దెయ్యం పట్టిందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు.
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనకు దెయ్యం పట్టిందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు.
ఎల్లారెడ్డిపేటలో శనివారం జరిగిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ.. సీఎం తన ఉనికిని కాపాడుకోవడం కోసమే తెలంగాణకు అడ్డంకులు సృష్టించేం దుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలిసిన ప్పటికీ ప్రజలను పక్కదారి పట్టించడం కోసం సీఎం రచ్చబండ సభలను వేదికలుగా ఉపయోగించుకుంటున్నాడని దుయ్యబట్టారు. అమరుల త్యాగాల ఫలితంగా ఆంక్షలు లేని రాష్ట్రం జనవరి నాటికి ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రెట్టింపుగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.