
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన బాధితులు న్యాయం కోసమే కోర్టులకు వెళుతున్నారని, న్యాయస్థానాలకు వెళ్లిన వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు 20నుంచి 30వేల ఎకరాలు అవసరం అవుతుందని, దీంతో పెద్ద సంఖ్యలోనే భూములు కోల్పోయినవారు ఉంటారన్నారు.
బాధితులు కోరుకున్న మేరకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మేడారం రిజర్వాయర్ పనుల్లో జాప్యంతో ఆయకట్టు రైతులు బాధితులవుతున్నారని అన్నారు. ఎస్సారెస్పీ 40 టీఎంసీలకు చేరుకోకుండానే తాగు నీటి అవసరాల కోసం మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారని, దీనివల్ల ఆయకట్టు రైతులు తమ పంటలకు నీరందక ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ఎస్సారెస్పీ కింద మొదటి పంటకు నీరందలేదని, ఇప్పుడు రెండో పంటకు కూడా అందకుండా పోతోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment