
అప్పుడు పాపాలు గుర్తుకు రాలేదా ?
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత విమర్శలను కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఖండించారు. ఎన్డీఏకి దగ్గర కావాలనే ప్రయత్నంలో భాగంగానే ఎంపీ కవిత... రాహుల్ను విమర్శిస్తున్నారని శనివారం హైదరాబాద్లో ఆరోపించారు.
పాపాలు కడుకొనేందుకు రాహుల్ పుష్కర స్నానాలు చేయాలనడం కవిత అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పినప్పుడు పాపాలు గుర్తుకు రాలేదా అంటూ జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణలో వెయ్యి మంది రైతుల ఆత్మహత్యల పాపం అధికార టీఆర్ఎస్దే అని స్పష్టం చేశారు. సదరు రైతు కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్...అందులో రైతుల వాటా ఎంతో చెప్పాలని జీవన్రెడ్డి అన్నారు.