
ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ...
హైదరాబాద్: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితులు, ప్రభుత్వం అలసత్వం కారణంగా రైతులు చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణమాఫీని ఏకమొత్తంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కష్టాలు తొలగిపోతాయనే భావన ప్రజల్లో వచ్చింది
* ముఖ్యంగా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు
* రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు
* వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి
* ఏ రకంగా చూసినా రైతులకు ఇబ్బందులు తప్పలేదు
* రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీయిచ్చింది
* ఏక మొత్తంగా రుణమాఫీ అమలు చేస్తుందని రైతులు అనుకున్నారు
* విడతలవారీగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది
* ఇంతవరకు వ్యవసాయ రుణాలను జాతీయ స్థాయిలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణమని విడదీయలేదు
* ఎన్నికల్లో ప్రకటించిన విధంగా రుణమాఫీ అమలు చేస్తే రైతులకు బాధలు తప్పేవి
* 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంతవరకు కొనసాగిన ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించింది
* ఉచిత్ విద్యుత్ ఇచ్చింది, విద్యుత్ చౌర్యాన్ని నిలువరించింది
* ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువగా తెలంగాణ రైతులు లాభపడ్డారు
* ఎవరూ ఊహించని విధంగా గ్రామగ్రామన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది
* ఆత్మహత్యలు చేసున్న రైతాంగానికి బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో జీవో 421 జారీ చేసింది
* ఒకవైపు నివారణ చర్యలు, మరోవైపు సహాయక చర్యలు చేపట్టింది
* కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు సరిపోదని ప్రతి క్వింటాలకు రూ. 50 బోనస్ గా ఇచ్చింది
* గత ప్రభుత్వ విధానాలను పరిగణనలోకి తీసుకుని రైతు ఆదుకునేందుకు ప్రయత్నించాలి
* గత ప్రభుత్వాలపై నెపం నెట్టడం కాదు, అంతకంటే మెరుగైన రీతిలో చర్యలు చేపట్టిండి
* రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. ప్రజలు ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు.
* రుణమాఫీ నామమాత్రంగా జరుగుతోంది
* రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి
* ప్రభుత్వం గొప్పలకు పోయి రైతు సమస్యలను జటిలం చేస్తోంది
* ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్నదాతల సమస్యలను పరిష్కరించాలి